Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారులతో ఇలాగ కూడా ఉండవచ్చు...

Advertiesment
చైల్డ్ కేర్
FILE
* చిన్నారులు పెద్దవారిని అనుకరిస్తూ చేసే సందడి చూడ ముచ్చటగా ఉంటుంది. అయితే అదే సమయంలో తమ నడవడికకు ప్రతిబింబంలా పిల్లలు చేసే అనుకరణను, అల్లరిని ఆటలా చూసి ముచ్చటపడే తల్లిదండ్రులకు తమ ప్రభావం చిన్నారులపై ఎంత ఉందో అనే విషయాన్ని కూడా అర్థం చేయిస్తుంది.

* సాధారణంగా పిల్లలవద్ద పెద్దలు ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడాలి. పిల్లల ఆలోచనలను తెలుసుకుని, వారి ఆసక్తులను గమనించాలి. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నట్లయితే వారు ఒకరినొకరు గౌరవించుకునే వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలతో సరదాగా ఉంటూనే, వారిలోని అనవసర భయాలను పోగొట్టాలి.

* రాత్రి భోజనలా సమయంలో పిల్లలతో సరదాగా కబుర్లు చెబుతూ భోంచేయాలి. డ్రాయింగ్, పెయింటింగ్ లాంటివి ఇంకా ఏవైనా కళాకృతులు తయారు చేస్తున్న పిల్లలతో కలిసి కూర్చుని వారిని ప్రోత్సహించాలి. ఇక పిల్లలు ఇష్టపడే ఆటలను కూడా వారితో కలిసి ఆడే ప్రయత్నం చేయాలి. అలాగే వారికి మంచి మంచి కథలు చెబుతూ, వారి ఇష్టాలను తెలుసుకుంటూ వారిలోని సృజనాత్మకతను వెలికి తీసుకురావాలి.

* పిల్లలు తెలిసీతెలియక ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను కించపరిచేలా మాట్లాడటం, అందరిముందూ హేళన చేయడం లాంటివి చేయకుండా, వారికి మెల్లగా నచ్చజెపుతూనే అలాంటి తప్పులు మళ్లీ చేయకూడదంటూ ఓపికగా వ్యవహరించాలి. అలాగే పిల్లలకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కార మార్గాలను కూడా వారినే ఆలోచించమని చెప్పాలి. అయితే వారికి సాధ్యంకాని పక్షంలో మాత్రం తల్లిదండ్రులు సహాయం చేసేందుకు ముందుకు రావాలి.

Share this Story:

Follow Webdunia telugu