Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎదిగే పిల్లల్లో భాషా ప్రావీణ్యం పెరగాలంటే..?

Advertiesment
చైల్డ్ కేర్
FILE
* ప్రస్తుతం ఎదిగేకొద్దీ పిల్లల్లో భాషా ప్రావీణ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. కొన్నిసార్లు పిల్లలకు మాటలు కూడా ఆలస్యంగా వస్తున్నాయి. అందుకే పిల్లలతో వీలైనంత మేరకు సంభాషించటం, చెప్పేది వినటం లాంటివి పెద్దలు చేయాలి. అయితే ఒక్క మాతృ భాషలో మాత్రమే చెప్పటం చేయాలి. దాంతోపాటు మరో భాష కూడా రావాలనే తపన వద్దు. వారికి ఏ ఒక్క భాషపైనా పూర్తి పట్టు రాదని అర్థం చేసుకోవాలి.

* ప్రతిరోజూ కొంత సమయం కేటాయించుకుని మీ చిన్నారికి పద్యం నేర్పిస్తున్నారు. నాలుగురోజులయ్యాక, ఆ పద్యాన్ని మీ అబ్బాయి మీతో చెప్పేందుకు యత్నిస్తుంటే.. పని చేసుకుంటూనే ఊకొట్టాలి. చేస్తున్న పనిని ఆపి ఆసక్తిగా వింటూ, పూర్తయ్యాక ప్రశంసించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ స్పందన పిల్లల్ల ఎనలేని ఉత్సాహాన్నిస్తుంది.

* పిల్లల్లో భావవ్యక్తీకరణ అనేది పుట్టినప్పుడే మొదలవుతుంది. ఏడుపు, నవ్వు, దిక్కులు చూడడం.. లాంటివన్నీ వారి అవసరాలను సూచిస్తాయి. కాబట్టి.. ఏడాది తర్వాత నేర్పిద్దాం అంటూ తేలిగ్గా తీసుకోకూడదు. వీలున్నప్పుడల్లా పాపాయిని దగ్గరకు తీసుకుని సంభాషించాలి. మీరు చెప్పేది అర్థం కానక్కర్లేదు కానీ.. తరచూ ఏదో ఒకటి ప్రస్తావించాలి. ఈ చర్య పరోక్షంగా వారిలో భద్రతాభావాన్నీ పెంచుతుంది.

* అలాగే పిల్లలకి సంబంధించి మీరు చేస్తున్న పనుల్ని చెప్పాలి. "నీకిప్పుడు స్నానం చేయిస్తా.. భోజనం తినిపించబోతున్నా.. ఇవాళ మనిద్దరం కలిసి, అమ్మమ్మ వాళ్లింటికెళుతున్నాం తెలుసా.." అంటూ ప్రతీది చెప్పాలి. ప్రయాణిస్తున్నప్పుడు కూడా "అదిగో చెట్టు.. ఆ బస్సుని చూడు, ఎంత పెద్ద కారో.." అంటూ వివరించాలి. ఇలా చేస్తే మాటలొచ్చాక పిల్లలే అన్నీ అడగడం మొదలుపెడతారు.

Share this Story:

Follow Webdunia telugu