Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో పిల్లల తగాదాల్లో పెద్దల జోక్యం అవసరమా..?

Advertiesment
చైల్డ్ కేర్
FILE
* ప్రతి కుటుంబంలో పసిప్రాయంలో పిల్లల మధ్య గొడవలు, తగాదాలు జరుగుతూనే ఉంటాయి. అవి పిల్లలు పెరిగేకొద్దీ సమిసిపోతాయి. శాశ్వతంగా ఉండవు కాబట్టి తల్లిదండ్రులు భయపడాల్సిన, బాధపడాల్సిన పనిలేదు. పిల్లల మధ్య పట్టుదలలు, మౌనపోరాటాలు శాశ్వతంగా ఉండవు. అయితే తల్లిదండ్రులు చేసే పొరపాట్ల వల్ల పిల్లల్లో మనస్పర్ధలు కలిగే అవకాశం కూడా ఉంటుంది.

* ఒక్కరి పక్షాన్నే మాట్లాడటం వల్ల పిల్లల మధ్య వైర భావం బాల్యం నుంచే ఏర్పడవచ్చు. కాబట్టి పిల్లలు కలహించుకునేటప్పుడు పెద్దలు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. తమ పిల్లలకు ఒక్కక్షణం కూడా పడదనీ తిట్టుకుంటూ ఉంటారనీ, శత్రువుల్లా తయారవుతున్నారనీ పెద్దలు అనకూడదు. ఒకరితో మరొకరిని పోల్చకూడదు. అలా చేయడం వల్ల పిల్లల మధ్య మనస్పర్ధలు, వ్యతిరేకభావాలు ఏర్పడతాయి.

* అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు కలహించుకున్నప్పుడు మగపిల్లాడిని వెనకేసుకొస్తూ అమ్మాయిని నిందించకూడదు. ఆధిక్యత, అసహాయత అన్న భావనలు వారి మధ్య పెంచకూడదు. ఇలా చేస్తే సుపీరియారిటీ, ఇన్‌ఫీరియారిటీ ఏర్పడటమేగాకుండా అసహనం, రోషం, ఆగ్రహంతో తన తోబుట్టువు బాధపడేలాగా చేసే శాడిస్టు మనస్తత్వాన్ని అలవర్చుకుంటారు. కాబట్టి పెద్దలు పిల్లలకు సమానంగా ప్రేమను పంచాలి. పిల్లల మనసుల్లో ఎటువంటి అనుమానం కలగకుండా ఎంతో సంయమనం పాటించాలి.

Share this Story:

Follow Webdunia telugu