ఆటల్లో పళ్లూడగొట్టుకున్నట్లయితే...?
* పిల్లలు ఆటల్లో దెబ్బలు తగుల్చుకుని ఒక్కోసారి పళ్లు ఊడగొట్టుకోవచ్చు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో దెబ్బలు తగిలి పన్నుకదిలినప్పుడు మొదట ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. పన్ను పూర్తిగా ఊడిపోతే దాన్ని తిరిగీ దాని స్థానంలో ఉంచేందుకు ప్రయత్నించి వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.* కదులుతున్న పంటితో నమలడం, కొరకడం లాంటి పనులు చేయకుండా ఉండటం మంచిది. ఈ విషయం పిల్లలకి అర్థమయ్యే తల్లిదండ్రులు తెలియజెప్పాలి. ఏదైనా కారణాలవల్ల పన్ను కదిలినా, ఊడిపోయినా వెంటనే డెంటిస్ట్‌ని కలవటం మంచిది. ఊడిపోయిన పన్నును అరగంటనుంచి మూడు గంటలలోపు మాత్రమే తిరిగీ అమర్చేందుకు వీలుగా ఉంటుందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.* కొంతమంది పిల్లలు రుచి బాగుందని టూత్‌పేస్టును తినేస్తుంటారు. అయితే మామూలు టూత్‌పేస్ట్‌లు కొద్దిగా లోపలికి వెళ్లినా పెద్దగా ప్రమాదమేమీ ఉండదుగానీ, ఔషధీయ పేస్ట్‌లు మింగటం వల్ల ప్రమాదం ఏర్పడవచ్చు. ఫ్లోరైడ్ టూత్‌పేస్టులను గనుక పిల్లలు తిన్నట్లయితే, అది వారి శరీరంలో చేరి విషప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.