Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదే పనిగా కాల్‌పాల్ పట్టించేస్తున్నారా..?

Advertiesment
బాలప్రపంచం
FILE
* సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు ఏ మాత్రం నలతగా కనిపించినా.. ఏదైనా నొప్పితో అదేపనిగా ఏడుస్తున్నా.. తల్లిదండ్రులు వెంటనే ప్యారాసెటమాల్ లేదా కాల్‌పాల్ సిరప్ పట్టించేస్తుంటారు. గులాబీ రంగులో ఉండే ఆ సిరప్ వెంటనే ప్రభావం చూపించి.. పిల్లల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తుంది, దాంతో తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకుంటుంటారు. అయితే అది సరికాదని వైద్యులు చెబుతున్నారు.

* చిన్న వయసులో ఎక్కువగా కాల్‌పాల్ సిరప్ తాగిన పిల్లల్లో 6 లేదా ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి.. ఆస్తమా, ఇతరత్రా అలర్జీల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పిల్లలు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనవసర అవసరాల కోసం ఈ సిరప్‌ను ఎక్కువగా వాడటం ఆరోగ్యపరంగా సరైనది కాదు. అలాగని దీన్ని వాడవద్దని ఏమీ వైద్యులు చెప్పటం లేదు.

* అయితే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకూ సర్వరోగ నివారిణిలాగా ఈ కాల్‌పాల్ సిరప్‌ను పిల్లలకు వాడటం వల్ల.. పలురకాల ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ సిరప్ కణజాలంలో వాపు లాంటి సమస్యల్ని కూడా పెంచుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడయ్యింది. కాబట్టి.. అవసరానికి మించి, ప్రతిదానికి ఈ సిరప్‌ను పిల్లలకు ఇవ్వకపోవటం మంచిదని తల్లిదండ్రులు గుర్తించాలి.

* ఎలాంటి సమయాల్లో కాల్‌పాల్ సిరప్ తీసుకోవచ్చంటే... పిల్లలు నొప్పితో బాగా బాధపడుతున్నప్పుడు, జ్వరం విపరీతంగా పెరిగిపోయి ఏమీ తినలేని, తాగలేని పరిస్థితి నెలకొన్నప్పుడు, దీనిని వాడమని వైద్యుడు చెప్పిన సందర్భాలలో వాడవచ్చు. అలాగే.. పిల్లలకు జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు, ఇతరత్రా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పుడు, కేవలం ఏడ్వకుండా ఉండేందుకు ఈ మందును వాడకూడదు.

Share this Story:

Follow Webdunia telugu