పెంపుడు కుక్కను అడవిలో భర్త వదిలివేశాడనీ.. భార్య ఆత్మహత్యాయత్నం
భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు రావడం సహజం. అదేసమయంలో చిన్నపాటి విషయాలకు కూడా భార్యాభర్తలు బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య కూడా అధికమయ్యాయి. తాజాగా ఓ వివాహిత పెంపుడు కుక్కను భర్త పట్టుకెళ్లి అడవిలో
భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు రావడం సహజం. అదేసమయంలో చిన్నపాటి విషయాలకు కూడా భార్యాభర్తలు బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య కూడా అధికమయ్యాయి. తాజాగా ఓ వివాహిత పెంపుడు కుక్కను భర్త పట్టుకెళ్లి అడవిలో వదిలివేయడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళనాడులోని వేలూరు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
వేలూరు, సుల్తాన్‌పేటకు చెందిన పెరుమాళ్ భార్య శాంతి (35) ఓ కుక్కను పెంచుతోంది. ఆమె కుక్కను కన్నబిడ్డలా పెంచుతుండడంతో పెరుమాళ్ జీర్ణించుకోలేక పోయాడు. దీనిపై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవ జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆ కుక్క పలు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కుక్క పిల్లలను చూసిన పెరుమాళ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
కుక్కను, దాని పిల్లలను పట్టుకుని అడవిలో వదిలిపెట్టాడు. పని నుంచి ఇంటికి వచ్చిన శాంతికి ఇంట్లో కుక్క లేకపోవడాన్ని గమనించి భర్తను ఆరా తీయగా, అసలు విషయం చెప్పాడు. దీన్ని జీర్ణించుకోలేని శాంతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించి అత్యవసర సేవల విభాగంలో చికిత్స అందిస్తున్నారు.