Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పన్నీర్ ఆశలపై చన్నీళ్లేనా? గవర్నర్‌కు కొత్త పరీక్ష

సుప్రీకోర్టు తీర్పుతో భంగపాటుకు గురైనప్పటికీ శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై ఆగ్రహం తొలగని నేపథ్యంలో సెల్వం ఆశలకు గండికొడుతూ ఆమె అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా తన నమ్మిన బంటు పళని స్వామిని ఎంపిక చేయడంతో తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిర

పన్నీర్ ఆశలపై చన్నీళ్లేనా? గవర్నర్‌కు కొత్త పరీక్ష
హైదరాబాద్ , బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (05:39 IST)
సుప్రీకోర్టు తీర్పుతో భంగపాటుకు గురైనప్పటికీ శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై ఆగ్రహం తొలగని నేపథ్యంలో సెల్వం ఆశలకు గండికొడుతూ ఆమె అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా తన నమ్మిన బంటు పళని స్వామిని ఎంపిక చేయడంతో తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం తనకు వ్యతిరేక తీర్పు వెలువడడంతో శశికళ... అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎంపిక చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు 13 మంది మంత్రులతో కలసి పళనిస్వామి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 5.30 గంటలనుంచి 15 నిమిషాలపాటు గవర్నర్‌తో భేటీ జరిగింది.
 
బలనిరూపణకు లేదా ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఎవర్ని ఆహ్వానిస్తారోనన్న ఉత్కంఠ తమిళనాట బయలుదేరింది. ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వంను ఆహ్వానిస్తారా అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కె.పళనిస్వామిని ఆహ్వానిస్తారా అన్న విషయమై విస్తృతచర్చ జరుగుతోంది. 
 
తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పెట్టిన సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు పళనిస్వామి అందజేశారు. లేఖను స్వీకరించిన గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. పళనిస్వామి, మంత్రులు భేటీ అనంతరం మీడియా ముందుకు సైతం రాకుండా నేరుగా కువత్తూరు క్యాంప్‌కు వెళ్లారు. పన్నీర్‌ సెల్వంను అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించడాన్ని కూడా పరిగణించి, న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే గవర్నర్‌ తన నిర్ణయాన్ని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
 
అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శశికళ క్యాంపునుంచి బయటకు రాకపోవడంతో పన్నీర్ మరోసారి సీఎం అయ్యే అవకాశాలు హుళక్కే అని అనుమానాలు ప్రబలుతున్నాయి. తొలినుంచి తమిళనాడు రాజకీయాలపై కన్నేసిన బీజేపీ తాజాగా పన్నీర్ సెల్వంని వదిలివేస్తున్న సూచనలు కనబడటం కొత్త సంక్షేభానికి దారితీస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైన్యాన్ని రాజకీయాలకు దూరంగా పెట్టడంలో భారత్ ఆదర్శం: పాక్ ఆర్మీ ఛీఫ్