Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగళూరు చిన్నమ్మ చెన్నయ్‌కు వచ్చేది ఖాయమేనా?

రెండు రోజుల క్రితం పళనిస్వామికి బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకోవలసిందిగా తమిళనాడు గవర్నర్ ఆహ్వానించిన విషయం విని శశికళ పరప్పన అగ్రహార జైలులో పట్టరాని సంతోషంతో గడిపారు. ఆ కబురు తనవద్దకు తెచ్చిన జైలు సిబ్బంది ముందు నవ్వులు కురిపిస్తూ అప్పుడే ఏమయింది

బెంగళూరు చిన్నమ్మ చెన్నయ్‌కు వచ్చేది ఖాయమేనా?
హైదరాబాద్ , ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (05:30 IST)
రెండు రోజుల క్రితం పళనిస్వామికి బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకోవలసిందిగా తమిళనాడు గవర్నర్ ఆహ్వానించిన విషయం విని శశికళ పరప్పన అగ్రహార జైలులో పట్టరాని సంతోషంతో గడిపారు. ఆ కబురు తనవద్దకు తెచ్చిన జైలు సిబ్బంది ముందు నవ్వులు కురిపిస్తూ అప్పుడే ఏమయింది అంటూ డైలాగ్ దంచారు శశికళ. అన్నట్టుగానే ఆమెకు అన్నీ కలిసొస్తున్నాయని అనిపిస్తోంది. తను ప్రతిపాదించిన అభ్యర్థి పళనిస్వామి శనివారం అసెంబ్లీలో బలపరీక్షలో గెలుపొందారు. వెనువెంటనే బెంగళూరు జైలు నుంచి చెన్నై జైలుకు తనను తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా మొదలు కానున్నాయి. దీంతో అదృష్టమంటే ఆమెదే అంటున్నారు విశ్లేషకులు.
 
పరప్పన అగ్రహార చెర నుంచి చెన్నై లేదా వేలూరు జైలుకు చిన్నమ్మ శశికళ అండ్‌ బృందాన్ని త్వరలో మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం తమ చేతికి చిక్కడంతో ఇక, చిన్నమ్మ క్షేమాన్ని కాంక్షించే రీతిలో పావులు కదిపే పనిలో పడ్డారు. రేపు (సోమవారం) కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలకు కసరత్తులు జరుగుతున్నాయి. అక్రమాస్తుల కేసులో శిక్ష పడడంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి చిన్నమ్మ శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్‌ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్నారు.
 
మధుమేహం, మోకాలినొప్పితో బాధ పడుతున్నారు. ఆమెకు ఆ చెరలో ఎలాంటి ప్రత్యేక వసతులు లేని దృష్ట్యా, జైలును మార్చేందుకు తగ్గ కసరత్తుల్లో రాష్ట్ర పాలకులు కసరత్తుల్ని వేగవంతం చేశారు. బలనిరూపణలో నెగ్గడంతో అధికారం తమదేనన్నది ఖరారు కావడంతో ఇక చెరలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న చిన్నమ్మను చెన్నై లేదా, వేలూరు జైలుకు మార్చి శిక్ష అనుభవించేలా చేయడానికి చర్యల్ని వేగవంతం చేశారు.
 
ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులు చిన్నమ్మ శశికళతో సంప్రదింపులు జరిపి, అందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేసి ఉన్నారు. తాజాగా రాష్ట్ర పాలకులు తమ ప్రయత్నంగా చిన్నమ్మ కోసం కసరత్తుల్ని వేగవంతం చేయడానికి నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలుకు న్యాయవాదులు చర్యలు తీసుకుని ఉండడం గమనార్హం. వయోభారం, ఆరోగ్య సమస్యల్ని పరిగణలోకి తీసుకోవడంతో పాటు, తమిళనాడు నుంచి బెంగళూరుకు అన్నాడీఎంకే వర్గాలు ఇక పోటెత్తే అవకాశం ఉందన్న విషయాన్ని కోర్టు ముందు ఉంచేందుకు ఆ పిటిషన్‌ సిద్ధం చేసి ఉన్నట్టు సమాచారం.
 
బల నిరూపణలో విజయంతో తమ చిన్నమ్మను ప్రసన్నం చేసుకునేందుకు భారీ ఎత్తున ఇక్కడి నుంచి మద్దతు దారులు, మంత్రులు, సీఎంతో కలిసి పరప్పన అగ్రహార చెరకు బయలు దేరడానికి సిద్ధం అయ్యారు. ఈ బల ప్రదర్శన కాస్త కర్ణాటక భద్రత వర్గాలు మున్ముందు సమస్యలు తమకెందుకు అన్న నిర్ణయానికి వచ్చే రీతిలో సాగించేందుకు కసరత్తులు చేసి ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే, త్వరలో చిన్నమ్మ జైలు మారడం ఖాయం అన్న ధీమాను మద్దతుదారులు వ్యక్తం చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరణించి రెణ్ణెళ్లయినా జయను వీడని కేసు ఖర్చులు