పిల్లి చెంతకు చేరిన ఎలుకల పోరు: ఢిల్లీలో అన్నాడీఎంకే వైరి వర్గాలు
ఒకే ఒరలో రెండు కత్తుల్లా అన్నాడీఎంకేపై రెండు గ్రూపుల ఆధిపత్య పోరుపై పంచాయితీ రాజధానికి చేరుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని, హోం మంత్రిలను కలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బృందం సోమవారం ఢిల్లీకి చేరుకుంది.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీ రెండుగా చీలిపోగా ఒకరినొకరు బహిష్కరించుకున్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని పన్నీర్‌సెల్వం వర్గం వాదిస్తోంది. శాశ్వత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన జయలలిత చేత ప్రిసీడియం చైర్మన్ గా నియమితులైన మధుసూదన్ పన్నీర్‌సెల్వం వైపున్న కారణంగా పార్టీ తమదేనని వాదిస్తున్నారు. పది మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు పన్నీర్ పక్షాన నిలవగా, మెజార్టీ ఎమ్మెల్యేలతో విశ్వాస పరీక్షను నెగ్గిన శశికళ వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఒకే ఒరలో రెండు కత్తుల్లా అన్నాడీఎంకేపై రెండు గ్రూపుల ఆధిపత్య పోరుపై పంచాయితీ రాజధానికి చేరుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని, హోం మంత్రిలను కలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బృందం సోమవారం ఢిల్లీకి చేరుకుంది. చిన్నమ్మ పదవిని కాపాడేందుకు ఆమె సోదరి కుమారుడు, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ న్యాయనిపుణులతో చర్చల్లో మునిగి తేలుతున్నారు.
అధికారం, పదవుల్లో ఉండేవారంతా శశికళ వైపు ఉండగా, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు పన్నీర్‌సెల్వంను ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వర్గాన్ని మరొకరు తమవైపు లాక్కునేందుకు తీవ్రస్థాయి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఐదేళ్లు వరుసగా ప్రాథమిక సభ్యత్వం లేని శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం చెల్లదనే ఫిర్యాదు ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉంది. శశికళ నియామకంపై అడ్డంకులు తలెత్తకుండా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
శశికళ ఎంపిక చెల్లదని ఎన్నికల కమిషన్ ప్రకటించినట్లయితే పన్నీర్‌సెల్వం తదితరులను పార్టీ నుంచి బహిష్కరించిన ఆదేశాలు చెల్లకుండా పోతాయి. అంతేగాక టీటీవీ దినకరన్ నియాకం కూడా చెల్లదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాల్సి ఉండగా రెండాకుల చిహ్నం ఎవరిదనే చిక్కుముడి ఉంది. చట్టపరవైున చిక్కుల్లో ఉన్న శశికళ వర్గీయులను మరిన్ని చిక్కుల్లోకి నెట్టేందుకు పన్నీర్‌సెల్వం ఢిల్లీ పయనం అయ్యారు.
అంతకు ముందు సేలం జిల్లా నేతలో పన్నీర్‌సెల్వం సమావేశమై శశికళ ఆధిపత్యాన్ని తిప్పికొట్టడం ఎలా అంశంపై అభిప్రాయాలు సేకరించారు. జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణ కోరుతూ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అలాగే ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలుస్తున్నారు. పన్నీర్‌వెంట 12 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు.