Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత ఆస్తుల పత్రాలు, వీలునామా గల్లంతయ్యాయా? అందుకే ఎస్టేట్‌పై దాడి జరిగిందా?

"మనిషి మరణించాకా ఏం ఎత్తుకుపోతారు.. ఏం బావుకుంటారు... మహారాణిలాగా తమిళనాడును ఏలిన జయలలిత నిస్సహాయం పరిస్థితుల్లో మరణించి ఏం బాపుకున్నారు. చావుతో ఏమీ మన వెన్నంటి రావన్న సత్యాన్ని ఆమె మరణం ఎంత స్పష్టంగా చాటింది? ఎందుకు అక్రమాస్తులపై మనుషులకు ఇంత ఆత్రుత

జయలలిత ఆస్తుల పత్రాలు, వీలునామా గల్లంతయ్యాయా? అందుకే ఎస్టేట్‌పై దాడి జరిగిందా?
హైదరాబాద్ , బుధవారం, 3 మే 2017 (09:06 IST)
"మనిషి మరణించాకా ఏం ఎత్తుకుపోతారు.. ఏం బావుకుంటారు... మహారాణిలాగా తమిళనాడును ఏలిన జయలలిత నిస్సహాయం పరిస్థితుల్లో మరణించి ఏం బాపుకున్నారు. చావుతో ఏమీ మన వెన్నంటి రావన్న సత్యాన్ని ఆమె మరణం ఎంత స్పష్టంగా చాటింది? ఎందుకు అక్రమాస్తులపై మనుషులకు ఇంత ఆత్రుత.." అంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు జయలలిత అంత్యక్రియలకు హాజరైన తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో మాట్లాడిన మాటలివి. హరీష్ రావు మాటల్లో ఎంత నిజముందంటే, జయలలిత ప్రాణప్రదంగా పెంచుకున్న ఆమె ఆస్తుల పత్రాలతోపాటు వీలునామా కూడా గల్లంతయిందని అనుమానిస్తున్నారు. ఆమెది ఒక దిక్కులేని చావు అయితే ఆమె ఆస్తులకు కూడా ఇప్పుడు దిక్కూ దివాణం లేకుండా పోవడం పరమ విషాదకరం.
 
నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లోకి గత నెల 23వ తేదీన 11 మంది గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సెక్యూరిటీగార్డు ఓం బహదూర్‌ను  హత్యచేశారు. అనంతరం ఎస్టేట్‌ అద్దాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి నగదు, నగలు, కొన్ని డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. జయలలిత గదిలో మూడు సూట్‌కేసులు పగులగొట్టిన స్థితిలో ఖాళీగా పడి ఉన్నాయి. ఆ సూట్‌కేసులో ఏమి ఉండేవి, దుండగులు వాటి నుండి ఏమీ ఎత్తుకెళ్లారో వివరాలు స్పషం కాలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌ సెక్యూరిటీ గార్డు హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో ఇప్పటి వరకు పది మందిని అరెస్ట్‌ చేసిన సంఘటనకు అసలైన కారణం వెలుగులోకి రాకపోగా జయ ఆస్తుల వీలునామా అపహరణకు గురైనట్లు అనుమానిస్తున్నారు. 
 
జయలలితకు చెందిన ఐదు చేతి గడియారాలు మాత్రమే దొంగతనానికి గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దోపీడీ, హత్యకు కేరళకు చెందిన కిరాయి ముఠాను ప్రయోగించినట్లు మాత్రం రుజువైంది. ఈ కేసులో సంతోష్‌స్వామి (39), దీపు (32), సతీషన్‌ (42), ఉదయకుమార్‌ (47)ను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిని విచారించగా జయలలిత వద్ద ఒప్పుడు కారు డ్రైవర్‌గా పనిచేసిన సేలంకు చెందిన కనకరాజ్, అతని స్నేహితుడు కోయంబత్తూరుకు చెందిన సయన్‌ తదితర 11 మంది పాత్ర ఉన్నట్లు కనుగొన్నారు. వీరిలో కనకరాజ్‌ కారు ప్రమాదంలో మృతి చెందడం, మరో అనుమానితుడు సయన్‌ తీవ్రగాయాలతో కోవై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం కేసు తీవ్రతను పెంచింది.
 
ఇదిలా ఉండగా పోలీసులు గాలిస్తున్న మనోజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారని, కాదు కాదు రెండు రోజులకు ముందే కేరళ పోలీసుల సమక్షంలో ఆయన లొంగిపోయాడని బిన్నవాదనలు వినపడుతున్నాయి. నీలగిరి పోలీసులు కేరళకు వెళ్లి మనోజ్‌ను స్వాధీనం చేసుకుని కొడనాడుకు తెచ్చారు. అతన్ని నాలుగు గంటలపాటూ విచారించారు. అక్కడి నుండి కొత్తగిరి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి డీఐజీ దీపక్‌ దామోదర్‌ తదితర ఉన్నతాధికారుల సమక్షంలో విచారించారు. కొడనాడులో హత్య, దోపిడీల్లో కనకరాజ్, సయన్‌ల తరువాత మనోజ్‌ ముఖ్యమైన నిందితుడగా భావిస్తున్నారు.
 
కనకరాజ్, సయాన్‌ల పరిస్థితి తనకు ఏర్పడుతుందనే భయంతోనే మనోజ్‌ పోలీసుల ముందు లొంగిపోయాడని అంటున్నారు. సంఘటన జరిగిన రోజున మనోజే ముందుగా ఎస్టేట్‌ గేట్‌ ఎక్కి బంగ్లాలో ప్రవేశించినట్లు విచారణలో తేలింది. దీంతో మంగళవారం ఉదయం 10 గంటలకు నీలగిరి జిల్లా మేజిస్ట్రేటు నేర విభాగం కోర్టులో మనోజ్‌ను ప్రవేశపెట్టగా 15 రోజుల రిమాండ్‌ పడింది. దీంతో అతన్ని కోవై సెంట్రల్‌ జైలులో పెట్టారు. కొడనాడు ఎస్టేట్‌ దోపిడికి పథక రచన చేసిన కనకరాజ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అనేక రహస్యాలు వెలుగుచూడక మిస్టరీగా మారింది.
 
పట్టుపడిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కొడనాడు ఎస్టేట్‌ నుండి రూ.200 కోట్ల విలువైన సొత్తుతోపాటూ జయ రాసిన వీలునామా సైతం అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. జయలలిత తన ఆస్తులపై సవివరమైన వీలునామాను రాసినట్లు సమాచారం. తన మరణానంతరం కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఏమి చేయాలని అందులో పేర్కొన్నట్లు భావిస్తున్నారు. ఈ వీలునామా జయలలిత గదిలోని సూట్‌కేసులో భద్రం చేసిందని అంటున్నారు. పగులగొట్టిన సూట్‌కేసుల నుండి వీలునామాను ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేస్తున్న పనులను ప్రజలకు చెప్పటానికి నోరు రాదు కాని నోరు మాత్రం జారుతున్నారు: ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి