Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బో.. స్వాతి ఎవరో రామ్ కుమార్ తెలియదంట.. కల్లబొల్లి కబుర్లు చెప్తూ.. పోలీసుల్ని టెన్షన్ పెడుతున్నాడా?

తమిళనాడులోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌‌‍లో జూన్ 24న ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని రామ్ కుమార్ అత్యంత దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమిస్తున్నానంటూ రామ్‌కుమార్‌ పలు మార్లు స్వాతి వెంటపడ్డాడ

Advertiesment
Ramkumar
, బుధవారం, 6 జులై 2016 (10:00 IST)
తమిళనాడులోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌‌‍లో జూన్ 24న ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని రామ్ కుమార్ అత్యంత దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమిస్తున్నానంటూ రామ్‌కుమార్‌ పలు మార్లు స్వాతి వెంటపడ్డాడు. ఆమె నిరాకరించిందనే అక్కసుతో జూన్‌ 24న నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. సీసీటీవీ ఫుటేజ్, సిమ్ క్లోనింగ్ ఆధారంగా రామ్ కుమార్‌ హంతకుడిగా పరిగణించి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
తన ప్రేమను అంగీకరించకపోవడంతో పాటు తనను కొండముచ్చు అనిందన్న కోపంతో ప్రతీకారంగా స్వాతిని హత్య చేసినట్లు అరెస్ట్ తర్వాత రామ్ కుమార్‌ పోలీసుల ముందు నేరాన్నిఅంగీకరించాడు. అనంతరం పోలీసులు హంతకుడు రామ్ కుమార్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు ఎవరూ ఊహించని విధంగా మాటమార్చాడు. 
 
జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రామదాస్ చెన్నై ప్రభుత్వాసుపత్రిలో వాంగ్మూలం నమోదు చేసుకునే సమయంలో ''నేను అమాయకుడిని.. తక్కువ కులం వాడినని పేద కుటుంబం నుంచి వచ్చిన వాడినని కావాలని పోలీసులు ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ" కల్లబొల్లి కబుర్లు చెప్తున్నాడు. కాని పోలీసుల విచారణలో తన ప్రేమను అంగీకరించకపోవడానికి తోడు తనను కొండముచ్చు అని అవమానించిందని, అందుకే స్వాతిని హత్య చేశానని అంగీకరించిన సంగతి తెలిసిందే. దీంతో కేసులో చిక్కుముడి వీడిపోయిందని భావించిన పోలీసులు, తాజా ట్విస్టుతో కేసు మళ్లీ మొదటికొచ్చిందని తలలు పట్టుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు, పలుకుబడి ఉంటే చాలు.. పోలీసులు రాచమర్యాదులు చేస్తారు... మాజీ ఎంపీకి?