Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవుడా ఈ రోజు మాత్రం నాది కానివ్వు... పన్నీర్, శశికళ జాగారపు వేడికోలు

హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడనంత టెన్షన్‌ ప్రస్తుతం ఆ ఇద్దరినీ ఆవహించింది. జయలలిత మరణించిన దినం తర్వాత వారికి మళ్లీ ఈరోజే శవజాగరణ అయింది. రేపు ఉదయించే సూర్యుడు ఎవరి పక్షం అన్న టెన్షన్‌ వారిని నిద్రపోనివ్వలేదు. సోమవారం రాత్రి అటు పన్నీర్ సెల్వం, ఇటు శశ

దేవుడా ఈ రోజు మాత్రం నాది కానివ్వు... పన్నీర్, శశికళ జాగారపు వేడికోలు
హైదరాబాద్ , మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (06:34 IST)
హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడనంత టెన్షన్‌ ప్రస్తుతం ఆ ఇద్దరినీ ఆవహించింది. జయలలిత మరణించిన దినం తర్వాత వారికి మళ్లీ ఈరోజే శవజాగరణ అయింది. రేపు ఉదయించే సూర్యుడు ఎవరి పక్షం అన్న టెన్షన్‌ వారిని నిద్రపోనివ్వలేదు. సోమవారం రాత్రి అటు పన్నీర్ సెల్వం, ఇటు శశికళ ఏ దేవుళ్లకు మొక్కుకున్నారో... ఏం జరగాలని ఆశించారో, ఏం జరగకూడదని ఆశించారో ఎవరైనా ఊహించవచ్చు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు చెప్పాలని ఒకరు.. అంతా తనకు మంచి జరిగేలా తీర్పు చెప్పాలని మరొకరు ముక్కోటి దేవతలకు ప్రార్థిస్తూ కాలం గడిపారు. 
 
సీఎం పీఠం కోసం పోటీపడు తున్న నేతలు వారు.  కోర్టు తీర్పు ఏమవుతుందో, గవర్నర్‌ ఏం చెబుతారోనన్న బెంగతో వారు రేయంతా జాగారం చేశారు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు చెప్పాలని ఒకరు.. అంతా తనకు మంచి జరిగేలా తీర్పు చెప్పాలని మరొకరు ముక్కోటి దేవతలకు ప్రార్థిస్తూ కాలం గడిపారు. వారే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత గా ఎన్నికైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ, మరొకరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం... 
 
శశికళ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికై ఇప్పటికే వారం రోజులు దాటిపోయింది. అయినా గవర్నర్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికే రెండు మార్లు ఆయనకు విజ్ఞప్తి చేసినా రాజ్‌భవన నుంచి తగు సమాధానం లేకుండాపోయింది. దీంతో పోరాటానికి సిద్ధమవుతున్న శశికళ శరాఘాతంలా సుప్రీంకోర్టు తీర్పు మంగళవారం వెలువరించనుందన్న వార్త వెలువడింది.
 
సోమవారం ఉదయం నుంచి ప్రత్యర్థులపై నిప్పులు చెరి గిన శశికళ.. సాయంత్రానికి మెత్తబడ్డారు. కోర్టు తీర్పు ఏం వస్తుందోనన్న బెంగ ఆమె మాటల్లో కనిపించింది. జయకు తనెంత సన్నిహితురాలో చెబుతూ.. ఆమెకు తను అందించిన అండదండలనూ ప్రజలకు గుర్తు చేశారు. అదే విధంగా ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. 
 
ముందుగా పోయెస్‌గార్డెనలోని తన ఇంట్లో మాట్లాడిన శశికళ కొద్దిసేపటికే రోడ్డుపైకొచ్చి కార్యకర్తనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం మళ్లీ కూవత్తూరు రిసార్టుకు వెళ్లేటప్పుడు, అక్కడ ఎమ్మెల్యేలతో భేటీ అయినప్పుడు, మళ్లీ చివరలో మీడియాతో మాట్లాడారు. ఒకే పూటలో మొత్తం ఐదుమార్లు ఆమె మీడియాతో మాట్లాడ్డంతో పాత్రికేయులే ఆశ్చర్యపోయారు.
 
అయితే సోమవారం రాత్రి కూవ త్తూరులోని రిసార్ట్స్‌లో పార్టీ శాసనసభ్యుల మధ్య ఆమె ప్రసంగించారు. శశికళ ప్రసంగం ఆద్యంతమూ బేలగానే సాగింది. ఆదివారం సాయంత్రం అదే చోట ఆమె చేసిన ప్రసంగంలోని వాడి వేడి ప్రస్తుతం మటుమాయమైంది.  ప్రస్తుతం పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని ఎంజీ ఆర్‌ అమెరికాలోని బ్రూక్లిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నప్పుడు జరిగిన ఎన్నికలతో పోల్చారు. 
 
అప్పట్లో కరుణా నిధి ఎంజీఆర్‌ అమెరికా ఆస్పత్రిలోనే మృతి చెందారని, మృతదేహాన్ని ఐస్‌బాక్స్‌లో ఉంచారని ప్రచారం చేశారని, ఆ సమయంలో జయలలిత రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసి పార్టీని గెలిపించారన్నారు. ఆ పూర్వవైభవాన్ని తెప్పించేందుకే తాను పార్టీకి నాయకత్వం వహిస్తున్నానని చెప్పారు.
 
చిన్నమ్మపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం సోమవారమంతా బిజీబిజీగా గడిపారు. గత వారం రోజుల్లో ఆయన వ్యవహారశైలికి, సోమవారం నాటికి తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. మంగళవారం సుప్రీంకోర్టు శశికళ విషయంలో తీర్పు వెలువరించనుందని వార్తలు వెలువడగానే ఆయన శిబిరంలో సంతోషం కనిపించింది. అయితే పన్నీర్‌సెల్వం మాత్రం దీనిని బయటకు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. మొత్తమ్మీద సుప్రీంకోర్టు తీర్పు ఇద్దరు నేతలకు కీలకంగా మారింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యేల చుట్టూ 600 మంది పోలీసులు: 20వేల పోలీసుల మోహరింపు