Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యాయం కోసం ఎంజీఆర్ బాటే శరణ్యం: ప్రజల్లోకి పన్నీర్ సెల్వం

దివంగత పురట్చితలైవర్‌ ఎంజీఆర్‌ బాటలో మాజీ సీఎం పన్నీరుసెల్వం ప్రజలో్లకి వెళ్లేందుకు నిర్ణయించారు. గతంలో ఎంజీఆర్‌ అనుసరించినట్టే, తాను సైతం ‘న్యాయం కోసం’ అంటూ కేడర్‌లోకి చొచ్చుకు వెళ్లనున్నారు. అన్నాడీఎంకే మూడుగా చీలడంతో ఎవరి వ్యూహాలతో వారు కేడర్‌ను త

న్యాయం కోసం ఎంజీఆర్ బాటే శరణ్యం: ప్రజల్లోకి పన్నీర్ సెల్వం
హైదరాబాద్ , సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (04:24 IST)
దివంగత పురట్చితలైవర్‌ ఎంజీఆర్‌ బాటలో మాజీ సీఎం పన్నీరుసెల్వం ప్రజలో్లకి వెళ్లేందుకు నిర్ణయించారు. గతంలో ఎంజీఆర్‌ అనుసరించినట్టే, తాను సైతం ‘న్యాయం కోసం’ అంటూ కేడర్‌లోకి చొచ్చుకు వెళ్లనున్నారు. అన్నాడీఎంకే మూడుగా చీలడంతో ఎవరి వ్యూహాలతో వారు కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు.
 
స్థానిక ఎన్నికల్లో తమ సత్తాను చాటుకునేందుకు తగ్గ పయనానికి సిద్ధం అవుతున్నారు. చిన్నమ్మ శశికళ శిబిరం ప్రస్తుతం అధికారంలో ఉండడంతో, మిగిలిన రెండు శిబిరాలు ప్రజా, కేడర్‌ మద్దతు లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి. ఓ వైపు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై సిద్ధం అవుతుంటే, మరోవైపు అన్నాడీఎంకే తమదేనని చాటుకునే విధంగా మాజీ సీఎం పన్నీరుసెల్వం కార్యాచరణలో నిమగ్నం  అయ్యారు. కేడర్, పార్టీ వర్గాలతో సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు.
 
ఆదివారం కూడా ఈ సమావేశం సాగింది. ఇందులో సీనియర్లు నత్తం విశ్వనాథన్, పొన్నయ్యన్, కేపీ మునుస్వామి పాల్గొన్నారు. అన్నాదురై  మరణంతో డీఎంకేను కరుణానిధి ఏ విధంగా తన గుప్పెట్లోకి తీసుకున్నారో, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ, అన్నాడీఎంకే ఆవిర్భావానికి నాంది పలుకుతూ అప్పట్లో ఎంజీఆర్‌ సాగించిన పయనాన్ని ఆసరాగా తీసుకునేందుకు నిర్ణయించారు. 
 
ఎంజీఆర్‌ బాటలో ‘న్యాయం కోసం ’ అన్న నినాదంతో కేడర్, ప్రజలో్లకి చొచు్చకు వెళ్లేందుకు నిర్ణయించారు. ఈ పయనం ఏ జిల్లా నుంచి శ్రీకారం చుటా్టలో అన్న విషయంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, సమావేశానంతరం పొన్నయ్యన్  మీడియాతో మాట్లాడుతూ, అమ్మ మరణం మిస్టరీపై తీవ్రంగానే స్పందించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉరితీసి నాలుగేళ్లవుతున్నా కసబ్ భూతం మన నేతల్ని వదలదా?