Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్‌కో సిమెంట్స్ కర్మాగారంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు...

రామ్‌కో సిమెంట్స్ కర్మాగారంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు...
, ఆదివారం, 23 మే 2021 (21:59 IST)
విరుదునగర్ జిల్లాలోని రామస్వామి రాజా నగర్‌లోని రామ్‌కో సిమెంట్స్ కర్మాగారంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పారు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే ప్రాణవాయువును జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయనున్నారు. 
 
ఈ ప్లాంట్‌ను ప్రజా సంక్షేమం, ప్రజా వినియోగార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రాణవాయును రాజపాళెయం, విరుదునగర్, శివకాశి, అరుబ్బుకోట్టై, సాత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.
webdunia
 
ఈ ప్లాంట్‌ను రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ సమక్షంలో ఈ ప్లాంట్‌ను విరుదునగర్ జిల్లా కలెక్టర్ ఆర్.కణ్ణన్ ప్రారంభించారు. రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా రోజుకు... 45 లీటర్ ద్రవ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయనుంది. 
 
ఇది వాయు రూపంలో 7 వేల లీటర్ల ప్రాణవాయుకు సమానం. నిమిషానికి 10 లీటర్ల చొప్పున ఒక ఆక్సిజన్ సిలిండర్‌ను ఒక రోగికి 10 నుంచి 12 గంటల పాటు ఉపయోగించవచ్చు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే మెడికల్ ఆక్సిజన్ ద్వారా ఒక రోజుకు 24 ప్రాణాలను రక్షించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనందయ్య మందులో హాని చేసే పదార్థాలేవీ లేవు : ఏపీ ఆరోగ్య శాఖ