మహిళా ఎస్ఐతో కానిస్టేబుల్ భార్య సంబంధం.. భర్తను చెప్పుతో కొట్టింది.. విషం తాగేశాడు..
తాళి కట్టిన భార్య మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో ఓ భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే...అరివఝగన్ (35) చెన్నైలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా
తాళి కట్టిన భార్య మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో ఓ భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే...అరివఝగన్ (35) చెన్నైలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య కూడా ఎస్ఐగా పనిచేస్తోంది. వీరిద్దరూ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే... అదే కాలేజీలో పనిచేస్తున్న మరో మహిళా ఎస్ఐతో తన భార్య సంబంధం కొనసాగిస్తోందని తెలిసి అరివఝగన్ నివ్వెరపోయాడు. అంతేకాదు వారిద్దరు ఒకే బ్యాచ్కు చెందినవారు కావడంతో స్నేహితులుగా ఉంటున్న వీరు పరిధి దాటి సంబంధం పెట్టుకున్నారని పోలీసుల విచారణలో వెల్లడించాడు.
వీరిద్దరి అసహజ సంబంధం గురించి తోటి పోలీసులు హేళనగా మాట్లాడుకుంటున్నారని..ఈ నేపథ్యంలో తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె తన భార్యకు చెప్పిందని తెలిపాడు. ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు మహిళా ఎస్ఐ తీవ్రంగా అవమానించిందని, చెప్పుతో కొట్టిందని వాపోయాడు. వీరిద్దరి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్టు పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.