Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుందని కోడలిని చంపేసిన అత్తామామలు.. ఎక్కడ?

కొడుకు పరువు తక్కువ పని చేశాడని.. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కోపంతో దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు పగను కడుపులో దాచుకుని... తీరా అదను కోసం వేచి చూసిన అతని తల్లిదండ్రులు, తమ పగను కోడలిపై కసితీ

Advertiesment
Honour killing
, శుక్రవారం, 24 జూన్ 2016 (09:28 IST)
కొడుకు పరువు తక్కువ పని చేశాడని.. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కోపంతో దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు పగను కడుపులో దాచుకుని... తీరా అదను కోసం వేచి చూసిన అతని తల్లిదండ్రులు, తమ పగను కోడలిపై కసితీరా తీర్చుకున్నారు. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సంతోష్, సుమతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఎనిమిదేళ్లు వీరి జీవితం సజావుగా సాగింది. సంతోష్... సుమతిని మొదటిసారి కోయంబత్తూరులో కలిశాడు. అప్పుడు ఆమె పీజీ చదువుతోంది. తొలిచూపులోనే మనసు పారేసుకున్నారు.
 
ఇద్దరి కులాలు వేరైనా, తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా.. పెద్దలను ఎదిరించి  పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు చదువుకున్న వారు కావడంతో ఎలాంటి మనస్పర్థలు లేకుండా వారి వైవాహిక జీవితం ప్రశాంతంగా ముందుకుసాగింది. ఇంతలో తల్లితండ్రులు తమ మనసు మారిందని చెబుతూ, సంతోష్ తల్లిదండ్రులు సుమతిని తమ ఇంటికి ఆహ్వానించారు. అత్తింటివారు పిలవడంతో... సంతోషంతో ఆమె ఇంటికి వచ్చింది. 
 
ఈ క్రమంలో సంతోష్‌కు ఇటీవల బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. దీంతో అతను తన సొంతూరు నామక్కల్ నుంచి హోసూర్‌కు మకాం మార్చాడు. అయితే ఉన్నట్టుండి ఏమైందోగాని... ఇంతలోనే సుమతి ఇంట్లో దారుణంగా హత్య చేయబడింది. ఒక రోజు దొంగలు వచ్చి, తమ కోడలిని హత్య చేసి నగలు ఎత్తుకు వెళ్లారని అత్తమామలు పోలీసులు ఫిర్యాదు చేశారు.
 
కానీ, పోలీసుల విచారణలో నమ్మలేని విషయాలు బయటికొచ్చాయి. కొడుకు కులాంతర వివాహాన్ని అంగీకరించి.. సుమతిని కొడలిగా ఒప్పుకున్నట్టు అతని తల్లిదండ్రులు పైకి నటించినప్పటికీ, వారు కడుపులో పగ దాచుకొని ఎనిమిదేళ్లు వేచి చూశారని, అదను రాగానే కొడలిని అత్యంత దారుణంగా చంపేశారని తేలింది. దీనిని చిత్రించేందుకు ఆమె ఫోన్‌ను, నగలను తామే తీసి దాచిపెట్టి.. పోలీసులకు కట్టు కథలు చెప్పారు. తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ కేసులో మృతురాలు సుమతి అత్తమామలు పళనివేల్, మధేశ్వరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పరువు హత్య కేసు నమోదుచేసి.. సేలం జైలుకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక నీతో ఉండలేను.. భర్త పిల్లలే నాకు ముఖ్యం.. ప్రియుడికి చెప్పిన వివాహిత.. సూసైడ్