Publish Date: Mon, 01 Sep 2014 (09:07 IST)
Updated Date: Mon, 01 Sep 2014 (09:08 IST)
అనారోగ్యం కారణంగా చెన్నైలో ఆదివారం సాయంత్రం కన్నుమూసిన దర్శక దిగ్గజం బాపు అంత్యక్రియలు, జపాన్ నుంచి ఆయన చిన్న కుమారుడు వేణుగోపాల్ చెన్నైకు వచ్చిన తర్వాతే నిర్వహిస్తామని పెద్ద కుమారుడు వెంకట్ రమణ తెలిపారు. దీంతో ఆయన అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి.
చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో బాపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బాపు పెద్ద కుమారుడు వెంకట్ రమణ తెలిపారు. జపాన్ నుంచి బాపు చిన్న కుమారుడు వేణుగోపాల్ సోమవారం రాత్రికి చెన్నై చేరుకోనున్నారు. ఆయన వచ్చిన తరువాతే అంత్యక్రియలు జరుగనున్నాయి. నేడు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు, చిత్రకారులు, అభిమానులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించనున్నారు.