Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్దమ్మాయి తప్పు చేసిందనీ.. ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న దంపతులు ఎక్కడ?

Advertiesment
Tamil Nadu
, బుధవారం, 23 డిశెంబరు 2015 (14:15 IST)
కొంతమందికి పరువు ప్రతిష్టలే ప్రాణం. అవమానభారాన్ని అస్సలు తట్టుకోలేరు. అలాంటి కుటుంబ పెద్ద ఒకరు.. తన పెద్ద కుమార్తె చేసిన తప్పుకు, దానివల్ల జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తన ఇద్దరు కుమార్తెలు, భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా అంబూరు సమీపంలో కట్టారి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కట్టారి గ్రామానికి చెందిన శేఖర్ (45), విజయలక్ష్మి (40) అనే దంపతులు ఉన్నారు. వీరికి నలుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె శ్రీనిత్య (24)కు వివాహం జరిగింది. రెండో కుమార్తె నవీన (22) ప్రేమ వివాహం చేసుకుంది. ఇక మూడో కుమార్తె నివేద (17) ప్లస్ టూ చదువుతుండగా, అనిత (15) ఏడో తరగతి చదువుతోంది. శేఖర్ వ్యవసాయం చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను శేఖర్ చదివించుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో తన పెద్ద కుమార్తె శ్రీనిత్యను బావమరిది బాలచంద్రన్‌కే ఇచ్చి వివాహం చేశాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా శ్రీనిత్య పుట్టింట్లోనే నివశిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వాణియంబాడిలోని జైన్ కాలేజీలో తమళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న మంగళసూత్రాల పంపిణీ పథకం కింద బంగారు తాళిబొట్టులను మంగళవారం ప్రదానం చేశారు. ఇందులో భార్యాభర్తలు వెళ్లితే తమకు కూడా బంగారు తాళి లభిస్తుందని భావించిన శ్రీనిత్య.. తన భర్త బాలచంద్రన్‌కు ఫోన్ చేసి రమ్మంది. అందుకు భర్త తొలుత అంగీకరించలేదు. కానీ, భర్తను ఎలాగోలా ఒప్పించింది.
webdunia
 
 
భార్య మాటలు విన్న బాలచంద్రన్.. కట్టారి గ్రామానికి వచ్చాడు. ఆ తర్వాత శ్రీనిత్య తన భర్తతో కలిసి జైన్ కాలేజీకి వెళ్లి బంగారు తాళి తీసుకుంది. అక్కడ నుంచి తన సమీప బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన శ్రీనిత్య.. అప్పటికే సిద్ధం చేసుకున్న బంగారు నగలు, వస్త్రాలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో లేచిపోయింది. ఈ విషయం పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లింది. ఇందులో శేఖర్ దంపతుల తప్పులేదని, అంతా శ్రీనిత్యదే తప్పని పెద్దలు తేల్చారు. 
 
అయితే, తన కుమార్తె చేసి పనని తీవ్ర అవమానంగా భావించిన శేఖర్ దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చిన శేఖర్ దంపతులు.. తమ ఇద్దరు కుమార్తెలను తీసుకుని బంధువుల ఇంటికి వెళుతున్నట్టు చెప్పి... చండియూర్‌లోని వేట్టి అనే ప్రాంత పొలాల్లో ఉన్న ఒక చెట్టుకు ఉరివేసుకున్నారు. ముందుగా తన ఇద్దరు కుమార్తెలకు ఉరిబిగించిన శేఖర్ దంపతులు.. ఆ తర్వాత ఒకే కొమ్మకు తాము ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. దీనిపై వాణియంబాడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu