బావిలో పడిన ఎలుగుబంటి ప్రాణాలతో బయటపడింది.. ఎలా..?
ఆహారం కోసం వెతుకుతూ అడవిలో నుండి బయటకు వచ్చిన ఒక ఎలుగుబంటి అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఇదే గ్రామంలోని పొలంలోకి మూడేళ్ల వయసున్న ఎలుగుబంటి ఆహారం
ఆహారం కోసం వెతుకుతూ అడవిలో నుండి బయటకు వచ్చిన ఒక ఎలుగుబంటి అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఇదే గ్రామంలోని పొలంలోకి మూడేళ్ల వయసున్న ఎలుగుబంటి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి పొరపాటున బావిలోకి జారిపడిపోయింది. దాంతో బయటికి రాలేక అలా నీళ్లలోనే ఈదుకుంటూ నానా అవస్థలు పడుతూ ఉండిపోయింది.
ఆ పంట పొలం యజమాని బావి వద్దకు వచ్చి చూడగా ఎలుగుబంటి కనిపించింది. దీంతో తక్షణమే అటవీశాఖ అధికారులకు యజమాని సమాచారం ఇచ్చాడు. ఇంకొక రోజు గడిచిపోయినట్లయితే ఆ బావిలోనే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. వెంటనే రంగప్రవేశం చేసిన అటవీశాఖ అధికారులు చేపలు పట్టే వలతో ఎలుగుబంటిని బావి నుంచి బయటకు తెచ్చారు. ప్రాణాలతో బయటపడ్డ ఎలుగుబంటి బయటకు రాగానే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని పరుగో పరుగున వెళ్లింది.