Publish Date: Mon, 22 Dec 2014 (09:19 IST)
Updated Date: Mon, 22 Dec 2014 (09:30 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేసంలో పోలవరం, శ్రీశైలం ప్రాజెక్టుల వివాదాలపై చర్చించాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం చేయనుంది.
ప్రశ్నోత్తరాల తర్వాత రుణమాఫీ, వ్యవసాయ మిషన్పై శాసనసభ చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లుపై చర్చించనున్నారు.