Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై రాజ్యలక్ష్మి వైద్య కాలేజీ హాస్పిటల్ ఆస్పత్రి ఉచిత వైద్య శిబిరం..

medical camp

ఠాగూర్

చెన్నై నగరంలో ఉన్న ప్రముఖ వైద్య కాలేజీల్లో రాజ్యలక్ష్మి వైద్య కాలేజీ ఆస్పత్రి ఒకటి. ఈ వైద్యకాలేజీ, ఆస్పత్రికి చెందిన విద్యార్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నగరిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నగరి పట్టణంలోని సీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ వైద్య శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థులతో కలిసి అనేక మంది స్థానికులు కూడా స్వచ్చంధంగా తరలివచ్చి వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్యంగా, రక్తపోటు, షుగర్, స్త్రీ సంబంధిత వ్యాధులు, ఎముకలు, ఈఎన్టీ, సాధారణ వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు.
webdunia
 
21 మంది వైద్యులు, సుమారు 500 మంది రోగులను పరీక్షించి వివిధ రకాలైన మందులను ఉచితంగా ఉందజేశారు. ఇందులో యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ రామ్ ప్రసాద్, నగరి బ్రాంచ్ మేనేజర్ యువరాజ్, ఏఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరానికి నగరి మున్సిపాలిటీకి చెందిన ప్రజలు మాత్రమే కాకుండా నగరి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు తీసుకున్నారు. ఈ వైద్య శిబిరాన్ని రాజ్యలక్ష్మి హాస్పిటల్, అన్నై హాస్పిటల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ హరిశంకర్ మేఘనాథన్, ఆయన సతీమణి డాక్టర్ అపూర్వ హరిశంకర్ మేఘనాథన్‌లు సంయుక్తంగా ప్రారంభించారు. డీన్ వనిత అధ్యక్షత వహించారు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాల్లో మహిళలు అదుర్స్