Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హన్సిక

Advertiesment
హన్సిక
పుట్టిన తేదీ : ఆగస్ట్ 9, 1991
అదృష్ట సంఖ్యలు : 2,5,8
ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ రంగాలలో హీరోయిన్‌గా రాణిస్తున్న నటి హన్సిక మొత్వానీ. తెలుగులో తొలి చిత్రం దేశముదురులో అమాయకంగా నటించి అందరి మనసులను దోచుకున్న నటి ఈమె.

హృతిక్ రోషన్ నటించిన కోయి మిల్ గయా తదితర హిందీ చిత్రాల్లో బాలనటిగా నటించిన ఈమె ఆ తర్వాత తెలుగు చిత్రసీమలోకి కథానాయికగా అడుగుపెట్టింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో కంత్రిలో నటించింది. ముంబయిలో పుట్టిన ఈమె ఇంకా తన స్కూలు చదువులోనే ఉన్నదంటే ఎవరూ నమ్మరేమో.

ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ అందరినీ నవ్విస్తూ ఉండే హన్సికకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అందరినీ కలుపుకునే గుణం ఈమెకు చక్కని పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. అయితే ముక్కు మీద కోపం మాత్రం కాస్త ఇబ్బంది పెట్టేదే. తన చుట్టూ ఉండేవారిని, మిత్రులను, చిత్ర రంగానికి చెందిన వారినీ ఎప్పుడూ గౌరవంగా చూస్తుంది.

కెరీర్‌లో ఆటంకాలు ఎదురైనా, వాటిని ఎదుర్కునే ధైర్యం ఈమెకు చిన్నప్పట్నుంచీ కాస్త ఉన్నా, ప్రస్తుతం వయసు, అనుభవంతో పాటు ధైర్యం కూడా పెరుగుతుంది. ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఇతరుల విషయాలలో తలదూర్చకపోవడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu