పుట్టిన తేదీ: ఆగస్టు 23, 1963
అదృష్ట సంఖ్యలు: 3,5
గత కొద్ది సంవత్సరాలుగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రాలను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపొందిస్తున్న దర్శకుడిగా శంకర్‌కు ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. తమిళంలో అయితే ఆయనే నెంబర్ వన్ అని కూడా చెప్పవచ్చు.
జెంటిల్‌మెన్‌తో రంగ ప్రవేశం చేసిన శంకర్ ఆ తర్వాత వరుసగా ప్రేమికుడు, జీన్స్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ వంటి వరుస హిట్ చిత్రాలను రూపొందించడం ద్వారా తానెంతటి నైపుణ్యం కలిగిన వాడనే విషయాన్ని సినీ ప్రపంచానికి చాటి చెప్పాడు.
ప్రముఖ తారలు, సాంకేతిక నిపుణులను వినియోగించి ఆత్మ విశ్వాసంతో ఆయన నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. ఆయా చిత్రాలకు తగినట్టు ప్రత్యేకతలు చూపుతుండటంతో కలెక్షన్లు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి.
కృషి, పట్టుదల, నిర్భీతి, మంచి మనసు, సాధువుగా కన్పించినప్పటికీ సమాజ దురాచారాలపై పోరాడే మనస్తత్వం, సృజనాత్మకత ఈయన సానుకూల అంశాలు కాగా, మొండితనం, అంత తేలిగ్గా ఎవరికీ అందుబాటులో లేకపోవడం, ఆడంబరం, సహనం లేకపోవడం వంటివి ప్రతికూల లక్షణాలుగా ఉన్నాయి.
ఈ లక్షణాలు శంకర్‌కు మాత్రమే కాక ఆగస్టు 17న పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఈయన అగ్రశ్రేణి దర్శకుడి స్థానాన్ని, అధిక రాబడిని ఇంకా చాలాకాలంపాటు అలాగే నిలబెట్టుకోగలరు. అయితే వృత్తిపరంగా కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో రూపొందించే చిత్రాల కలెక్షన్ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు.
సొంత నిర్మాణమైనా, ఇతర బ్యానెర్లపై రూపొందించే చిత్రమైనా బడ్జెట్ విషయాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా స్నేహితులు, బంధువులు అండగా నిలవడం ప్లస్ పాయింట్. అనవసర విషయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయకపోవడం మంచిది.