పుట్టిన తేదీః అక్టోబర్ 20, 1978
అదృష్ట సంఖ్యలు: 1,2,7
ప్రపంచ కప్ తొలి వన్డేలో పెద్దగా రాణించక పోయినప్పటికీ, బెర్ముడాతో జరిగిన వన్డేలో వీరోచిత ప్రదర్శనతో మరో మారు క్రికెట్ అభిమానుల్లో సెహ్వాగ్ కొత్త ఉత్సాహాన్ని నింపాడు. భారత ఓపెనర్‌గా బరిలో దిగి ప్రత్యర్థులను బెంబేలెత్తించిన సెహ్వాగ్ గత కొంతకాలంగా పెద్దగా ప్రకాశించలేకపోయినప్పటికీ, ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోని సెహ్వాగ్ పట్టుదలతో ప్రపంచ కప్ జట్టులో చోటుదక్కించుకోవడమే కాక అందుకు తగ్గట్టు జట్టు తరపున చక్కగా రాణించారు.
ప్రయత్నం మాత్రమే కాక సత్ప్రవర్తన, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే సెహ్వాగ్ మరెన్నో మంచి గుణాలు కూడా కలిగి ఉన్నాడు. అల్లర్లకు పాల్పడే వారు, ఇతరులను దూషించే వారికి అతనెంతో దూరం. సైన్స్ కన్నా కళలపై ఆసక్తి అధికంగా కలిగి ఉన్నాడు. అయితే అదే సమయంలో తరచూ టెన్షన్లకు గురవడం ఆయన సహజ గుణం.
ఈ తరహా గుణాలు కేవలం సెహ్వాగ్‌కు మాత్రమే కాక అక్టోబర్ 20లో పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. జనవరి, మార్చి, ఏప్రిల్, అక్టోబర్, డిసంబర్‌లలో జన్మించిన వారు సెహ్వాగ్‌కు మంచి మిత్రులు కాగలరు. ఉదాహరణకు జనవరి 11లో పుట్టిన ద్రావిడ్ అతనికి మంచి మిత్రుడయ్యాడు. సెహ్వాగ్ తన ప్రతిభను నిరూపించుకునే రీతిలో అధిక స్థాయిలో అవకాశాలు దక్కించుకుంటాడు. దాన్ని సద్వినియోగం చేసుకునే రీతిలో ప్రయత్నాలను సాగుతాయి.