పుట్టిన రోజు : ఏప్రిల్ 7, 1962
అదృష్ట సంఖ్యలు : 3, 6
భారత చలన చిత్ర ప్రపంచంలో తెలుగువారి తరఫున ప్రముఖ దర్శకుల పట్టికలో రామ్‌గోపాల్ వర్మకు ప్రత్యేక స్థానం ఉంది. మన రాష్ట్రంలో జన్మించిన ఆయన అక్కినేని నాగార్జున నటించిన శివ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.
సెప్టంబర్ మాస ఫలితాలు :
ఒక నెలలో రోజు ఎంత వేగంగా ముందుకు పోతుంటాయో అదే వేగంగా వీరు తమ పనిని సకాలంలో చక్కబెట్టుకుంటారు. అయినప్పటికీ తమ శ్రమకు తగ్గ ఫలితం మాత్రం కొంత ఆలస్యంగానే పొందుతారు. స్నేహితులు, సహోద్యోగులు ప్రోత్సాహాన్నిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం అవసరం. అనవసరమైన విమర్శలకు తలవంచకపోవడం మంచిది.
రాత్, రంగీలా, సత్యా వంటి పలు చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు వహించిన వర్మ షోలే చిత్రాన్ని ఆగ్‌గా మార్చి ఈ తరం అభిమానులకు అందించి రంజిపచేశాడు. టెన్ష్, ఆందోళ, ఉద్వేగం, నమ్మకం, ఉత్సాహం, సరైన సమయంలో హాస్యం ఆలోచనా శక్తి వంటివి ఇతని ప్రత్యేకతలు. అదేసమయంలో కొంత తొందరపాటు, చిన్న విషయానికే టెన్షన్‌కు గురికావటంవి ఇతని నెగటివ్స్.
ఎదురుచూసిన విజయం లభించనప్పటికీ, ప్రయత్నానికి తగ్గ ఫలితం అందుతుంది. శరీరంలో అలసట ఏర్పడినప్పటికీ మనసులో ఉత్సాహం తగ్గకుండా ఉంటుంది. మొత్తానికి ఈ మాసం కొంత సరదాగానే ఉంటుంది.