మీరు ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో జన్మించారా?
, బుధవారం, 12 మార్చి 2014 (17:29 IST)
ఆశ్లేష నక్షత్రం తొలి పాదములో పుట్టిన జాతకులు 17 సంవత్సరముల వరకు బుధ మహర్థశ ప్రభావం ఉండటంతో పచ్చను బంగారముతో పొదిగించుకుని ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అలాగే 17-24 సంవత్సరముల వరకు ఈ జాతకులకు కేతు మహర్ధశ కావున వైఢూర్యమను వెండితో పొదిగించుకుని చిటికెన వ్రేలికి ధరించడం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించడం, మంచి ఉద్యోగంలో స్థిరపడటం వంటి ఫలితాలుంటాయి. కాగా.. 44-50వరకు ఈ ఆశ్లేష 1వ పాదములో పుట్టిన జాతకులకు రవి మహర్ధశ కావున కెంపును వెండితో ఉంగరపు వేలుకు ధరించాలి. అలాగే 50-60 సంవత్సరముల వరకు ఆశ్లేష 1వ పాదములో జన్మంచిన వారికి చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇకపోతే.. ఈ జాతకులకు 60-67 సంవత్సరముల వరకు కుజ మహర్ధశ ప్రభావం ఉండటంతో పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించడం మంచిది. అలాగే 67-85 సంవత్సరాల వరకు ఆశ్లేష జన్మకారులకు రాహు మహర్ధశ కావున గోమేధికమును వెండితో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే జీవితంలో శ్రమించి ఉన్నత పదవులను అలంకరించే ఆశ్లేష 1వ పాదములో పుట్టిన జాతకులు, ఇతరుల సలహాలను గౌరవిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. అయితే కొత్త వ్యాపారాలను ఆరంభించడంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే.. ఈ జాతకులకు తెలుపు, నీలం, క్రీమ్ రంగులు కలిసివస్తాయి. ఈ రంగులతో కూడిన దుస్తులు, నగలు ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. ఇంకా 7, 2 అనే సంఖ్యలు వీరికి అనుకూలిస్తాయి. 2, 11, 20, 29, 38, 47 , 16, 25, 34, 43, 52, 61, 70 వంటి సంఖ్యలు కూడా ఈ జాతకులకు కలిసివస్తాయి. కానీ 4 అనే సంఖ్య వీరికి అశుభం. కాగా, ఆశ్లేష ఒకటో పాదంలో పుట్టిన జాతకులకు బుధ, ఆదివారాలు మంచి ఫలితాల నివ్వగా, గురువారం మాత్రం వీరికి కలిసిరాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.