Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీది హస్త నక్షత్రమా? ఇతరులను ఆకర్షించే అందం మీదే!

Advertiesment
హస్తనక్షత్రం
, గురువారం, 20 మార్చి 2014 (18:07 IST)
File
FILE
చంద్రగ్రహ నక్షత్రమైన హస్తనక్షత్రంలో పుట్టిన జాతకులు ఇతరులను తమ అందచందాలతో ఆకట్టుకుంటారని జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు. అందంతో పాటు గుణంలోనూ ఇతరులను ఆకర్షించే ఈ జాతకులు ఎదుటివారి కష్ట సుఖాలను తేలికగా అర్థం చేసుకుంటారు. అలాగే ఎదుటివారి అడగకుండానే సహాయం చేస్తారు.

ఇంకా సహోదరి పట్ల మంచి అభిమానం కలిగి ఉండే హస్త నక్షత్ర జాతకులు ఇష్టమైన విద్యను చదువుకుంటారు. అయితే బంధువుల వల్ల కొన్ని అపోహలు ఎదురవుతాయి. వంశాభివృద్ది, కీర్తి ప్రతిష్టలు వీరి వెన్నంటే ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉన్నత భావాలు కలిగిన మంచి మిత్రబృందం, ఆత్మీయవర్గం ఈ జాతకులకు లభిస్తుంది.

అయితే హస్త నక్షత్ర జాతకులు ప్రేమ వివాహాలు చేసుకోవడంలో మక్కువ చూపుతారట. రహస్యాలను దాచడంలో నైపుణ్యం కలిగిన వీరు అందులోని లోతుపాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

తల్లిదండ్రులకు, పెద్దలకు గౌరవం ఇచ్చే వీరి వైవాహిక జీవితం సర్దుకుపోవడం వల్ల సజావుగా నడుస్తుంది. చేసిన తప్పును బేషరతుగా ఒప్పుకునే ఈ హస్త నక్షత్ర జాతకులు తమ వ్యాపారాలను స్వంత తెలివి తేటలతో అభివృద్ధి చేస్తారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.

ఇకపోతే.. హస్త నక్షత్ర జాతకులకు పచ్చ, ఆరంజ్, తెలుపు రంగులు కలిసొస్తాయి. అలాగే ఎప్పుడు పచ్చరంగు చేతి రుమాలు వాడితే అభివృద్ధి ఉంటుంది. అలాగే పసుపు, పచ్చ రంగులు కలిసి ఉండే దుస్తులను ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇంకా ఈ హస్త నక్షత్ర జాతకులు అదృష్టమైన సంఖ్య: 5. అలాగే 1, 4, 6, 7, 5, 13, 23, 32, 41, 50, 59 వంటి సంఖ్యలు వీరికి అన్ని విధాలా సహకరిస్తాయి. అయితే 2, 3, 8, 9 అనే సంఖ్యలు వీరికి ఏ మాత్రం కలిసిరావు. అలాగే బుధవారం వీరికి కలిసొస్తుంది. బుధవారం ఎలాంటి శుభకార్యాన్నైనా ప్రారంభించడం చేయవచ్చు. అలాగే శని, శుక్రవారం ఈ హస్త నక్షత్ర జాతకులకు సామాన్య ఫలితాలనిస్తుంది.

కానీ మంగళవారం ఈ జాతకులు ఏ మాత్రం కలిసిరాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని వారు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu