పుట్టిన రోజుః జులై 7
అదృష్ట సంఖ్యలుః 4,5, 7
అతి తక్కువ కాలంలో తన ప్రతిభా, సామర్థ్యాలతో కీర్తి శిఖరాలకు చేరుకున్న భారత వికెట్ కీపర్లలో మహేందర్ సింగ్ ధోనిని ప్రముఖంగా చెప్పవచ్చు. సయ్యద్ కిర్మాని తర్వాత ఈ ఆల్ రౌండ్ వికెట్ కీపర్ స్థాయిలో మరెవ్వరూ రాణించలేక పోయారంటే అతిశయోక్తి కాదు. తన ధీరోధాత్త ప్రదర్శనతో దేశంలో సచిన్ తర్వాత అదే స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న ఏకైక క్రికెటర్ ధోనినేనని చెప్పవచ్చు.
తరచూ తన చర్యలతో చుట్టూ ఉన్న వారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడం జులై 7న పుట్టిన ఈ తరహా జాతకులకు చాలా ఇష్టం.
చర్యలు మాత్రమే కాక వీరి రూపు రేఖలు ఇతరులను ఆకర్షించే రీతిలో ఉంటుంది. అంతేకాక వీరిని అంత తేలిగ్గా ఎవరూ అర్థం
చేసుకోలేరు. వృత్తిలో ఎంత ఆసక్తి కనబరుస్తారో అదే శ్రద్ధ కుటుంబంపై కూడా చూపగలరు.
ఆర్ట్స్, క్రీడాంశం వీటితో పాటు స్నేహితులతో బాతాఖానీ వీరికి మరింత ఇష్టం. అయినప్పటికీ, చేసే పనిపై మాత్రం చక్కగా దృష్టి సారిస్తారు. మహీ అని మిత్రులు ముద్దుగా పిలిచే ధోనికి జనవరి, మార్చి, మే, జులై, డిసెంబర్ నెలల్లో పుట్టిన వారందరూ మంచి
మిత్రులు కాగలరు. జీవితంలో అత్యున్నత స్థాయిని అందుకోగలిగిన ఈ తరహా జాతకులు ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకోగలరు. కుటుంబాన్ని వదిలి వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ, వారితో సంబంధాలు మాత్రం బలంగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.