Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత ప్రధాని మన్మోహన్ సింగ్

భారత ప్రధాని మన్మోహన్ సింగ్
పుట్టినతేది: 26, సెప్టెంబర్ 1932
అదృష్ట సంఖ్యలు: 4, 6. 9
భారత ప్రధానిగా అందరికీ సుపరిచితులైన మన్మోహన్ సింగ్ తన పదవికే వన్నె తెచ్చినవారిగా గుర్తింపు పొందారు. ప్రముఖ ఆర్థికవేత్తగా అందరి ప్రశంసలు అందుకున్న మన్మోహన్‌ను ఐదేళ్ల క్రితం ఏర్పడిన యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ప్రధానిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

గతంలో ఆర్థిక నిపుణుడిగా అనేక ప్రశంసలందుకున్న మన్మోహన్ ప్రధానిగా సైతం తన ప్రతిభను నిరూపించుకున్నారు. రాజకీయాల్లో ఉన్నాకూడా ఆ రాజకీయ వాసనలు తన దరిచేరకుండా కేవలం కర్తవ్య నిర్హణ విషయంలోనే ఆయన తన మనసును లగ్నం చేయడం విశేషం. అలాగే యూపీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నీడలో పాలన సాగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడినా ప్రధాని మన్మోహన్ మాత్రం తన కర్తవ్య నిర్వహణ విషయంలో తప్ప మరే విషయంలోనూ పెదవి విప్పకపోవడం గమనార్హం.

అలాగే ప్రధానిగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో సైతం ఎలాంటి అవినీతి ఆరోపణలు అంటని వ్యక్తిత్వం మన్మోహన్ సొంతం. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మన్మోహన్ స్వాతంత్ర్యం రాకముందు అంటే 1932 సెప్టెంబర్ 26న పంజాబ్‌లో జన్మించారు. అయితే దేశ విభజన అనంతరం మన్మోహన్ జన్మించిన ప్రదేశం పాకిస్థాన్‌లో భాగంగా మారింది. దాంతో భారత్‌కు వచ్చేసిన ఆయన ఆర్థికశాస్త్ర నిపుణుడిగా యూనివర్సిటీ పట్టా పుచ్చుకున్నారు.

అనంతరం ఆయన వివిధ పదవుల్లో తన సత్తా నిరూపించుకున్నారు. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన మన్మోహన్‌ను గమనిస్తే ఎన్నో అంశాలు మనకు ఆసక్తి కలిగిస్తాయి. ప్రచారం కోసం కాకుండా తను అనుకున్న పనిని గురించి మాత్రమే ఆలోచించడం మన్మోహన్ ప్రత్యేకత. అలాగే కాంగ్రెస్ వారి దయతో ప్రధాని పదవి వరించినా తన అస్థిత్వాన్ని కాపాడుకోవడంలో మాత్రం ఆయన ఎలాంటి వెనకడుగూ వేయలేదు.

దీంతోపాటు ప్రధాని పదవిలో ఉన్నాకూడా బంధుప్రీతి ప్రదర్శించడం, అవినీతికి పాల్పడడంలాంటి ఎలాంటి పనులకు మన్మోహన్ పూనుకోలేదు. రాజకీయాలకు సంబంధించిన పదవిని నిర్వర్తిస్తున్నా తాను మాత్రం ఎలాంటి రాజకీయాలకు పాల్పడకపోవడం కూడా మన్మోహన్ ప్రత్యేకత. మన్మోహన్‌లో కనిపించే ఈ విశిష్టతలన్నీ ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 26 తేదీకి సంబంధించిన రాశి అయిన తులారాశిలో జన్మించినవారికి కూడా వర్తిస్తాయి.

ఈ రాశిలో జన్మించినవారు ఎప్పుడూ కూడా హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. అలాగే చిన్నతనం నుంచి చదువు విషయంలో చాలావరకు ఇతరులు మెచ్చుకునేలా ఉంటారు. దీంతోపాటు ఎదో ఒకరంగంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగలగడం వీరి ప్రత్యేకత. అలాగే జీవితకాలంలో ఏదో ఓ దశలో మంచి ఉన్నతస్థానం లేదా సమాజంలో గౌరవం, హోదా కలిగిన పదవిని వరిస్తారు.

అయితే నలుగురిలో భిన్నంగా ఉండడం, అంతర్వర్తనమైన ప్రవర్తన కలిగిన వీరు అంతగా ఛతురోక్తులుగా ఉండరు. వీరిని చూసినవారికి వీరొక విజ్ఞానులుగానో, గర్విస్టులులాగో కనిపిస్తారు. అయితే ఎవరేమీ అనుకున్నా అనుకున్న పనిపై మాత్రమే మనసు లగ్నం చేయగలగడం వీరిలో ఉండే ఓ గొప్ప లక్షణం.

Share this Story:

Follow Webdunia telugu