పుట్టిన తేదీ: మే4, 1983
అదృష్ట సంఖ్యలుః 4, 6, 8
అమాయకంగా బుంగమూతి పెట్టి అటు మాతృభాష తమిళంతో పాటు తెలుగు చిత్రరంగంలోనూ తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్న ఇటీవలి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వరకు కూడా తన హవాను కొనసాగిస్తూనే ఉంది.
మౌనం పేసియదే చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి పరిచయమైన త్రిష తెలుగులో వర్షంతో శ్రీకారం చుట్టింది. కేరళలోని పాలక్కాడులోని తమిళ సంతతి కుటుంబానికి చెందిన త్రిష 1999లో సేలం జిల్లా అందార రాణిగా, 2000లో మిస్ చెన్నైగానూ, ఆ తర్వాత 2001లో మిస్ ఇండియా స్మైల్ గానూ ఎన్నికైంది.
గలగలా మాట్లాడటం, కపటం లేకుండా తలచిన పనులు చేయడం త్రిష సహజ గుణాలు. ఎల్లవేళలా ఆమె చుట్టూ స్నేహితుల బృందం ఉంటున్నప్పటికీ, ఆమెకు చాలా దగ్గరయ్యే వారు అతి తక్కువ సంఖ్యలోనే ఉంటారు. తాను చేసే ప్రతిపనిని అమిత శ్రద్ధతో చేసే త్రిష అందుకు తగ్గట్టు విజయాలను కూడా అందుకుంటుంది. తన కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో ముందుంటుంది. ప్రజా జీవితంలోనూ కలసిపోగలదు.
అయితే అదే సమయంలో ఏ విషయాన్నీ రహస్యంగా ఉంచకుండా తన మిత్రులతో పంచుకోవడం ఆమె మైనస్ పాయింట్ కాగలదు. ఇది త్రిషకు మాత్రమే కాక మే4లో పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
జనవరి, మార్చి, ఏప్రిల్, జులై, డిసెంబర్ నెలల్లో పుట్టిన వారు త్రిషకు మంచి స్నేహితులు కాగలరు. వృత్తిలో పోటీ కారణంగా కొంత భయం ఏర్పడుతున్నప్పటికీ, ఆమె స్థానానికి ఏ మాత్రం ఢోకా లేదు. తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. అయితే వీరి పాలిట అదే పాజిటివ్‌గా మారుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ, తరచూ అలసటకు గురయ్యారు.