Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పి. చిదంబరం

Advertiesment
పి. చిదంబరం
పుట్టిన తేదీః సెప్టెంబర్ 16
అదృష్ట సంఖ్యలుః 2, 5, 7
ప్రస్తుతం భారత రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రముఖులలో చిదంబరంను ముఖ్యుడిగా పేర్కొనవచ్చు. తమిళనాడులోని శివగంగలో పుట్టిన చిదంబరం చిన్ననాటి నుంచే రాజకీయాల్లో మక్కువ పెంచుకున్నారు.

క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి దశల వారీగా ఎదుగుతూ వచ్చిన చిదంబరం ప్రస్తుతం భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆర్థిక మంత్రి స్థాయికి ఎదగడం వెనుక ఆయన పట్టుదల, ఆత్మవిశ్వాసం ప్రధానాయుధాలుగా నిలిచాయి.

పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు వచ్చినప్పటికీ, మరొకరి సారధ్యంలోనే పనిచేసేందుకు ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన చేపట్టే ప్రతి పనిలోనూ
అంకిత భావం కన్పిస్తుంది. అలాగే ఏ పనిలోనూ భావావేశంతో కాక తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు పరిపాటిగా మారింది.

వృత్తిలో ఎంత శ్రద్ధ చూపుతారో, అదే స్థాయిలో తనను నమ్ముకున్న వారిపై కూడా శ్రద్ధ తీసుకుంటారు. తన భావాలను బయటకు కన్పించకుండా నియంత్రించుకోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి.

ఈ లక్షణాలు చిదంబరంకు మాత్రమే కాక సెప్టెంబర్ 16న పుట్టిన అందరికీ వర్తిస్తుంది. జనవరి, మార్చి, జులై, డిసెంబర్ నెలల్లో జన్మించిన వారందరూ వీరికి మంచి మిత్రులు కాగలరు.

పని భారం అధికంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం అందుకు చక్కగా సహకరించడం ఆయనకు అనుకూలమైన అంశం. కుటుంబంతో సంబంధాలు చక్కగా ఉన్నప్పటికీ, వారితో కలసి గడిపే సమయం చాలా తక్కువే.

కొన్ని సందర్భాల్లో చంచలత్వానికి గురవుతున్నప్పటికీ, త్వరలోనే అందులోంచి కోలుకుని తిరిగి సన్నద్ధమైపోగలరు. అలాగే విమర్శలను సైతం తనకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం చిదంబరం సొంతం.

Share this Story:

Follow Webdunia telugu