Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తరగని అందానికి చిరునామా త్రిష

తరగని అందానికి చిరునామా త్రిష
పుట్టినతేది: మే 4.
అదృష్టసంఖ్యలు: 4, 6, 8.
తమిళంలో స్టార్ హీరోయిన్‌గా నటిస్తూ అప్పుడప్పుడూ తెలుగు తెరపై తళుక్కుమనే త్రిష ఏళ్లు గడుస్తున్నా అదే అందంతో నేటికీ అభిమానుల హృదయాలను కొల్లగొడుతుండడం విశేషం. తెలుగులో తాజా చిత్రం కింగ్‌లో నాగార్జున సరసన నటించిన త్రిషా 2008ని ఓ చక్కని విజయంతో ముగించింది.

తెలుగులో త్రిష నటించిన చిత్రాలు తక్కువే అయినా అందులో అగ్రభాగం మెగాహిట్లే ఉండడం విశేషం. వర్షం, నువ్వొస్తానంటే నేవద్దంటనా, పౌర్ణమి, రమణ, కింగ్ ఇలా త్రిష నటించిన చిత్రాలన్నీ ఆమెకు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతోపాటు అభిమానులను ఆమెకు సొంతం చేశాయి.

తమిళనాడులో జన్మించిన త్రిష ప్రారంభంలో మాడలింగ్ చేసి అటుపై చిత్రరంగంలో అడుగుపెట్టింది. ప్రారంభంలో ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా తర్వాతి రోజుల్లో నటించిన చిత్రాలన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో తమిళంలో అగ్రశ్రేణి కథానాయికా మారింది. త్రిష తర్వాత ఎంతమంది హీరోయిన్లు వచ్చినా తమిళనాట త్రిషదే అగ్రస్థానం.

అలాగే తెలుగులో ఏడాదికి ఒకటి చొప్పున నటించినా ఇక్కడా ఆమెకు అభిమానులకు కొదవలేదు. ఇలా రెండు భాషా చిత్రాల్లో బిజీబిజీగా సాగిపోయే త్రిషను గమినిస్తే కష్టపడి నటించడం, చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహించడంలాంటి గొప్ప లక్షణాలెన్నో కన్పిస్తాయి. అందివచ్చిన అవకాశాలను జారవిడవకపోవడం, విమర్శలు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగడం త్రిషలో కన్పించే గొప్ప అంశాలు.

త్రిష పుట్టిన తేదీ మే4 ఈ తేదీ ప్రకారం చూసినపుడు త్రిషలో కన్పించే సుగుణాలన్నీ ఈ తేదీన జన్మించిన చాలామందిలో కన్పిస్తాయి. ఈ తేదీన జన్మించినవారు కెరీర్ పరంగా అగ్రస్థానంలో ఉండేందుకు ప్రయత్నిస్తారు. అదేసమయంలో వ్యక్తిగత జీవితానికి సైతం చాలా విలువనిస్తారు.

అదేసమయంలో ఇతరులు తమపై విమర్శలు గుప్పించినా దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అలాగే చిన్నస్థాయి నుంచి మొదలుపెట్టి జీవితంలో ఒక్కో మెట్టుగా అగ్రస్థానం సాధించగల్గుతారు. ముఖ్యంగా జీవనపయనంలో ఎదురయ్యే అవమానాలు, అపనిందలకు ఏమాత్రం కుంగిపోకపోవడం వీరికున్న అదనపుబలం.

Share this Story:

Follow Webdunia telugu