పుట్టిన రోజు : నవంబర్ 15, 1986
మహిళల టెన్నిస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ముఖ్యమైన క్రీడాకారిణులలో సానియాకు ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. టెన్నిస్ ఆటపై భారతీయులకు ఆసక్తి పెంచిన సానియా ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణిలను ఎదుర్కొనేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తోంది.
ప్రతిభతో పాటు తన రూపురేఖలతో అందరినీ ఆకట్టుకోవడం ఆమె సహజ గుణం. ఆత్మవిశ్వాసం, ధైర్యం, గుండె నిబ్బరం తదితర లక్షణాలు ఆమె గెలుపునకు దోహదపడుతున్నాయి.
బాగా ఆలోచించి స్థిరంగా తీసుకునే నిర్ణయాలు, విమర్శలను పట్టించుకోకుండా, మనసులో అనిపించిది ఎటువంటి జంకు లేకుండా చెప్పగలగడం ఈమె ప్లస్ పాయింట్లు. ఈ లక్షణాలే కొన్ని సందర్భాల్లో ఆమెకు కొందరు శత్రువులను కూడా కొని తెచ్చి పెడుతోంది.
ఈ లక్షణాలు సానియాలో మాత్రమే కాక నవంబర్ 15వ తేదీన జన్మించిన ప్రతి ఒక్కరికీ ఉంటాయి. మార్చి, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు సానియాకు సన్నిహితులు కాగలరు.
సానియాను విజయాలు వరించినప్పటికీ కూడా కొన్ని ఓటములను ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ ఓటములనే పాఠాలుగా నేర్చుకుని ముందుకు దూసుకు వెళతారు వీరు. ఈ నెల చురుగ్గా, ఉత్సాహంగా పని చేసి మంచి పేరు సంపాదించగలరు.