Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురు గ్రహ ప్రభావంతో కలిగే వ్యాధులేంటి?

Advertiesment
గురు గ్రహ ప్రభావంతో కలిగే వ్యాధులేంటి?
, సోమవారం, 5 మే 2014 (15:43 IST)
FILE
గురు గ్రహ దోషం వల్ల అనేక రకాల వ్యాధులు కలుగుతాయి. ముఖ్యంగా కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి.

అలాగే గౌరవహాని, పండితపామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అందుచేత గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu