Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గతి తప్పిన నా జీవితం బాగుపడేదెలా..?: బ్రిట్నీ

గతి తప్పిన నా జీవితం బాగుపడేదెలా..?: బ్రిట్నీ
FILE
సమస్యల సుడిగుండంలో కొట్టుకపోతున్నప్పుడు భగవంతుడిని ప్రార్థించి ఆ కష్టాల నుంచి గట్టెక్కించమని వేడుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. అదేవిధంగా జీవితం గతుకులమయంగా తోచినపుడు భవిష్యవాణి నిపుణులను సంప్రదించి తగిన సలహాలివ్వమని అర్థించడమూ జరుగుతుంది.

ఇపుడు ఆ స్థితికి హాలీవుడ్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్ కూడా వచ్చేసింది. గతి తప్పిన తన జీవితం గాడిలో పడే మార్గాన్ని సూచించమని ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త రస్సెల్ గ్రాంట్‌ను అభ్యర్థిస్తూ ఓ విద్యుల్లేఖ రాసింది.

బ్రిట్నీ తనకు ఇ- మెయిల్ పంపిన మాట వాస్తవమేనని సదరు జ్యోతిష నిపుణుడు గ్రాంట్ వెల్లడించాడు. ఆమె పంపిన సమాచారాన్ని అనుసరించి జాతకాన్ని చెపుతాననీ, ఆమె జీవితంలో నిలదొక్కుకునేందుకు తగిన సూచనలు చేస్తానని అంటున్నాడు.

బ్రిట్నీ స్పియర్స్ చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నది. కేరీర్ శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు ఆమె జీవితం అకాస్మాత్తుగా పాతాళ లోకానికి జారిపోయింది. ఆ తర్వాత మానసికంగా కుంగిపోయి పిచ్చిపట్లుగా మారి కొన్నాళ్లు ఆస్పత్రిలో వైద్యం సైతం చేయించుకున్నది. ప్రస్తుతం తిరిగి యధాస్థితికి రావడంతో జీవితాన్ని విజయవంతమైన మార్గంలో గడపాలని నిశ్చయించుకున్నదని బ్రిట్నీ సన్నిహితుడొకరు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu