Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరా నక్షత్రంలో జన్మిస్తే పైసా ఖర్చు పెట్టరట!!

Advertiesment
ఉత్తరా నక్షత్రంలో జన్మిస్తే పైసా ఖర్చు పెట్టరట!!
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (17:35 IST)
File
FILE
రవి గ్రహ నక్షత్రమైన ఉత్తర నక్షత్రంలో జన్మించిన జాతకులకు తండ్రి, సహోదర వర్గం బలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెపుతోంది. సకాలంలో వివాహం, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గుప్తంగా ధనం, స్థిరాస్తులు అధికంగా కలిగి ఉండే ఈ జాతకులు.. డబ్బు విషయంలో ఉదార స్వభావులని భావిస్తారు. కానీ ఆచరణలో పైసా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి వందరెట్లు ప్రతిఫలం ఉంటేనే వ్యయం చేస్తారు.

ఇతరులను అవమానించడం ఈ జాతకులను అత్యంత సంతోషకరమైన పని. తేనెటీగలాగా కూడబెట్టి ధనాన్ని వృద్ధి చేయడమే వీరి జీవితాశయం. అంతర్గతంగా పిరికి మనస్తత్వం, భార్య ఆధిపత్యం అధికం. రాజకీయ, వ్యాపార రంగాలు వీరికి చక్కగా కుదురుతాయి. వీరికి జీవితంలో రహస్యాలు బైటపడనంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాహు, గురు దశల కారణంగా ఉత్తర నక్షత్రములో పుట్టిన జాతకులకు స్పెక్యులేషన్ లాభిస్తుంది.

అంతేకాకుండా, ఈ జాతకులకు నైతిక బాధ్యతలు అధికం. అంతగా పరిచయం లేని రంగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. పరోపకారం చేయడం చాలా తక్కువ. చౌకగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే సంపాదనలో బంధుత్వానికి పాపభీతికి చోటు ఉండదు.

వీరి అదృష్ట సంఖ్య 3 కాగా, అదృష్ట రంగులు క్రీమ్, తెలుపు, ఆరంజ్. వీరికి ఆదివారం, బుధవారం మంచి ఫలితాలనిస్తుంది. శనివారం సామాన్య ఫలితాలను పొందవచ్చు. అయితే మంగళవారం వీరికి ఏమాత్రం కలిసిరాదని జ్యోతిష్యులు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu