Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలాంటి కల వస్తే కష్టాలు తప్పవ్!

Advertiesment
అలాంటి కల వస్తే కష్టాలు తప్పవ్!
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (17:26 IST)
File
FILE
ప్రతి కలకూ ఓ అర్థం ఉంటుందనీ మన పెద్దలు చెపుతుంటారు. జ్యోతిషులు కూడా కలల వెనుక ఉన్న అర్థాలను ఇలా చెపుతున్నారు. తనకు తానై ఇష్టపడిన స్త్రీని లేవదీసుకు పోయినట్లు పురుషుడు కలగంటే కష్టనష్టములు తప్పవంటున్నారు. ఇంకా కలలో అప్సరసలు, కన్యలు కనిపిస్తే ధన లాభం కలుగుతుంది.

పెండ్లికాని యువకుడికి కలలో కన్య కనిపిస్తే వెంటనే వివాహమవుతుందట. ఆడవారికి కలలో పసిపిల్లలు కనబడితే అనారోగ్యం కలుగుతుంది. ఒక స్త్రీ ప్రసవిస్తున్నట్లు కల వచ్చినట్లయితే సుఖజీవనము, అధిక సౌఖ్యము కలుగుతాయి.

ఇంద్రధనస్సు తనకు దగ్గరగా కానీ, తన నెత్తిమీద ఉన్నట్లు కల వచ్చినట్లయితే దరిద్రులకు ధన లాభం కలుగుతుంది. ధనవంతులకు ధన నష్టము కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu