Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21వ తేదీన జన్మించారా?... అయితే స్త్రీకి దాసోహమే....

21వ తేదీన జన్మించారా?... అయితే స్త్రీకి దాసోహమే....
, బుధవారం, 12 ఫిబ్రవరి 2014 (15:53 IST)
File
FILE
సంఖ్యాశాస్త్రం ప్రకారం 21వ తేదీన జన్మించిన జాతకులు ప్రతి విషయాన్ని స్థూలంగా పరిశీలించి, కార్యాచరణ చేస్తారు. పలుకుబడితో అధికారం చెలాయించే సత్తా కలిగిన ఈ జాతకులు ప్రత్యేక వ్యక్తిత్వమును కలిగి ఉంటారని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు.

క్రీడారంగములో పేరు ప్రఖ్యాతలు సంపాదించే ఈ జాతకులు, ఆస్థి విషయాల్లో, ఆరోగ్య విషయమునందు జాగ్రత్త వహించడం చాలా మంచిదని సంఖ్యా శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా.. ఈ తేదీలో పుట్టిన వారు పట్టుదలతో ఎలాంటి కార్యన్నైనా సాధించగలరని చెపుతున్నారు. వాద - ప్రతివాదములు చేసి ఇతరులను లొంగదీసుకోవడంలో వీరికి వీరే సాటి. ధనవంతులకు జన్మించే ఈ జాతకులు భోగభాగ్యములతో జీవిస్తారట. అంతేకాదు.. స్త్రీలకు లొంగిపోవడం, అధికంగా ధనాన్ని వ్యయం చేయడం వీరి స్వభావం.

ఇకపోతే.. ఆంగ్లభాష, వ్యాకరణములందు నిపుణత్వం కలిగి ఉండే వీరు దయా హృదయాన్ని కలిగి ఉంటారు. ఈ తేదీన పుట్టిన వారిలో కొందరు గాయకులుగానూ, పోలీసు ఆఫీసర్లుగానూ రాణిస్తారు. అంతేగాకుండా.. ఈ జాతకులు ఇతరదేశాల్లో విద్యనభ్యసించి, ఉన్నత పదవులకు అలంకరిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu