Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19వ తేదీన పుట్టారా... అయితే ముక్కుమీద కోపం!

Advertiesment
19వ తేదీన పుట్టారా... అయితే ముక్కుమీద కోపం!
, సోమవారం, 31 మార్చి 2014 (14:28 IST)
File
FILE
సాధారణంగా 19వ తేదీన పుట్టిన జాతకులు ఎవరి ఆధీనంలోనూ ఉండేందుకు ఇష్టపడరని జ్యోతిష్కులు చెపుతున్నారు. ఇతరుల సలహాలను స్వీకరించడానికి వీరి మనస్సు అంగీకరించదు. ఈ స్వభావం కారణంగా జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ తేదీలో పుట్టిన స్త్రీ పురుషులు స్థిర మనసత్త్వంతో, స్వతంత్రులుగా ఉంటారు. కళలు, సాహిత్యంపై వీరికి మక్కువ ఎక్కువ. అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉండే వీరు.. అన్ని రంగాల్లో రాణించి, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు.

ఇతరుల సమస్యలను పరిష్కరించేందుకు వివిధ రకాలైన అభిప్రాయాలను, సూచనలను ఇచ్చే వీరికి ముక్కు మీద కోపం వస్తుంది. అయితే అతి త్వరలోనే తమ కోపాన్ని నిగ్రహించుకుని శాంతపడి, ముందు జరిగిన తతంగాన్ని శుభ్రంగా మరచిపోతారు.

ఇంకా చెప్పాలంటే... 19 తేదీన పుట్టిన స్త్రీ, పురుషులు అపారమైన కల్పనాశక్తిని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, బలమైన వ్యక్తిత్వం వీరిని వెన్నంటి ఉంటుంది. అనుకున్న కార్యాన్ని పట్టుదలతో పూర్తి చేసేందుకు కృషి చేస్తారు. వీరు పనిచేసే సంస్థల్లో ప్రతిభను కనబరచి పై అధికారుల మన్నలను పొందుతూ ముందుకు సాగుతారు.

ప్రతి సంవత్సరం జులై నుంచి ఆగస్టు, మార్చి నుంచి ఏప్రిల్ వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. 1, 10, 19, 2, 4, 7, 11, 13, 20 25, 31 వీరికి మంచి తేదీలు.

Share this Story:

Follow Webdunia telugu