Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

108 సంఖ్యకు ఎందుకంత ప్రాధాన్యం...?!!

Advertiesment
108 సంఖ్యకు ఎందుకంత ప్రాధాన్యం...?!!
, బుధవారం, 14 మే 2014 (12:48 IST)
File
FILE
హైందవ సంస్కృతీ సంప్రదాయాలలో 108 సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఉపయోగించే పవిత్ర మాలలో 108 పూసలు ఉంటాయి. ఒక్క హిందూ సంప్రదాయల్లోనే కాకుండా బౌద్దం, సిక్కు, జైన మతాచారాల్లో సైతం ఈ సంఖ్యకు ప్రాధాన్యం ఉంది. మంత్రోచ్ఛారణకు 108 సార్లు చేయడం ఆచారం. జపాన్‌లోని జైన దేవాలయాల్లో కొత్త సంవత్సరం ఆరంభం నాడు 108 సార్లు గంటలు కొడతారు.

ఎందుకీ సంఖ్యకు ఇంతటి ప్రాధాన్యం..? అని చూస్తే... మన ప్రాచీన ఋషులు గొప్ప గణాంకవేత్తలు, నిజానికి మన సంఖ్యా వ్యవస్థను గుర్తించినది వారే. ఈ సంఖ్యకు ప్రాధాన్యాన్ని వారే సంతరించి పెట్టారు. పూర్తిస్థాయి మనుగడకు 108 సంఖ్య ప్రాధాన్యతను వహిస్తుంది.

* తొమ్మిది సంఖ్యకు పరిపూర్ణత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 108ని కూడితే వచ్చేది తొమ్మిది. అంతేకాదు ఏ సంఖ్యను 9 సార్లు హెచ్చించి, కూడినా వచ్చే సంఖ్య తొమ్మిదే.
* తొమ్మిది గ్రహాలు 12 రాశుల ద్వారా ప్రయాణిస్తాయి. వాటిని గుణించగా అంటే 9 x 12 = 108 వస్తుంది.

* 27 నక్షత్రాలలో ఒక్కోదానికి నాలుగు పాదాలుంటాయి. 27 నక్షత్రాలు అగ్ని, భూమి, గాలి, నీరు అన్న నాలుగు అంశాలపై విస్తరించి వుంటాయి. అంటే 27 x 4 = 108.
* ప్రాచీనకాలం నాటి తాళపత్ర గ్రంథాల్ని అనుసరించి విశ్వం 108 అంశాల కలయికతో ఏర్పడింది.

Share this Story:

Follow Webdunia telugu