రాహుకాల పూజల్లో బెల్లంను నైవేద్యంగా వాడొచ్చా?
, మంగళవారం, 18 మార్చి 2014 (18:00 IST)
చాలా మంది దోష నివారణ నిమిత్తం రాహుకాల పూజలు చేస్తుంటారు. ఇలాంటి పూజల్లో బెల్లంను నైవేద్యంగా వాడొచ్చా లేదా అనే అంశంపై పూజారులను సంప్రదిస్తే.. బెల్లం అన్నాన్ని శ్రీ మహా గణపతికి 22 రోజులు పూజ చేసి నైవేద్యం పెట్టిన తరువాత పశువులకు పెట్టి అనంతరం బెల్లం ప్రసాదాన్నిభుజిస్తే మీరు కోరిన పనులు త్వరగా నెరవేరుతాయి.నవగ్రహ హోమాల్లో మరియు పూజల్లో ఉంచే బెల్లం అచ్చును ఇంటివారు పూజచేయించిన బ్రాహ్మణులు పానకం చేసుకుని తాగితే అన్ని పనులు త్వరగా పూర్తి అవుతాయి. బెల్లం అన్నాన్ని సరస్వతి దేవికి నైవేద్యంగా పెట్టి చిన్న పిల్లలకు పంచితే పనులన్నీ నెరవేరతాయి. విద్యాభ్యాసంలో ఎక్కువ మార్కులు పొంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది.శ్రీ లక్ష్మీ నరసింహా దేవునికి బెల్లాన్ని నైవేద్యంగా ఉంచి దంపతులకు ప్రసాదంగా ఇచ్చి ఇంట్లో ఉన్నవారందరూ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఎటువంటీ దుష్ట మంత్రాలు మీపై పని చేయవు. నవగ్రహాలకు తాంబూలంలో బెల్లాన్ని పెట్టి పూజ చేసి బెల్లాన్ని నైవేద్యంగా ఉంచి తాంబూలంలో బెల్లం అన్నాన్ని పెట్టి దానం చేస్తే మీ కష్టాలు త్వరలో తొలగిపోతాయి.శ్రీ లక్ష్మీ నారాయణ దేవునికి బెల్లం అన్నం నైవేద్యంగా పెట్టి తింటే దాంపత్యంలో ఉండే అన్ని రకాల విరసాలు, గొడవలు చాల త్వరగా తొలగిపోతాయి. శ్రీ ధన్వంతరి హోమంలో బెల్లం అన్నంతో హోమాన్ని పూర్తి చేస్తే సర్వరోగాలు నయం అవుతాయి.శ్రీ సూర్యానారాయణ దేవునికి బెల్లం అన్నాన్ని నైవేద్యం చేసి ప్రసాదాన్ని తింటే మీకు ఉన్న అన్ని రకాల నేత్ర రోగాలు, హృదయ రోగాలు, చర్మ రోగాలు చాల త్వరగా తొలగిపోతాయి. రాహుకాలంలో చేసే పూజ, కొన్ని దేవతల పూజల్లో బెల్లం నైవేద్యాన్ని పెట్టి దానం చేస్తే మీపై ప్రయోగించిన అన్ని రకాల మాంత్రిక శక్తులు, దిష్టిలు త్వరగా తొలగిపోతాయి.శ్రీ మహాలక్ష్మీ పూజ చేసి బెల్లం అన్నాన్ని నైవేద్యం పెట్టి తాంబూలంతో సహా దానం చేస్తే శ్రీమంతులు కావటంతో పాటు లక్ష్మీ అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. వ్యాపారస్తులు శుక్రవారం పూజకు బెల్లం అన్నాన్ని చేసి తాంబూలంతో బెల్లం అన్నాన్ని దానం చేస్తే వ్యాపారం పెరిగి ఎక్కువ లాభం వస్తుంది.