Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీది పుబ్బ నక్షత్రమా? అయితే స్నేహంకోసం ప్రాణమిస్తారు.!

మీది పుబ్బ నక్షత్రమా? అయితే స్నేహంకోసం ప్రాణమిస్తారు.!
, శుక్రవారం, 21 ఫిబ్రవరి 2014 (17:54 IST)
File
FILE
శుక్రగ్రహ నక్షత్రమైన పుబ్బ నక్షత్రంలో పుట్టిన జాతకులు అదృష్టానికి దగ్గరగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. అవసరమైతే అర్హత లేని వారిని కూడా తన మనిషిగా భావించి అందలం ఎక్కిస్తారు. స్నేహితుల వలయం ఎక్కువగా ఉండే ఈ జాతకులు.. స్నేహం కోసం ప్రాణమైనా ఇస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే కొందరు స్నేహితుల ఉచ్చునుండి జీవితాంతం వీరు బయటపడలేరు.

సమాజసేవలో మంచి చురుకైన పాత్ర పోషించే ఈ జాతకులు.. ఇతరుల అభిప్రాయాలను ఏ మాత్రం ఖాతరుచేయరు. చేతికి అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తన వర్గాన్ని మాత్రం బలోపేతం చేసుకుంటారు.

ఇతరులకు సాయం చేయాలనే తపన కలిగివుండే పుబ్బ నక్షత్ర జాతకులు.. విద్యాదానం, అన్నదాన సత్రాల ఏర్పాటులో అధిక శ్రద్ధ తీసుకుంటారు. దేశ, విదేశాల్లో మంచి పరిచయాలు కలిగి ఉండే వీరు.. అన్యభాషలు సైతం అనర్గళంగా మాట్లాడుతారు. తన జీవిత శైలికి భిన్నంగా సంతానాన్ని వేరు రంగాల్లో ప్రోత్సహిస్తారు. పైకి కనిపిస్తున్న జీవితం కాకుండా రహస్య జీవితం గడుపుతారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు సైతం వీరి లోపాలను స్పష్టంగా చెప్పలేరు.

ఇక ఈ పుబ్బ నక్షత్ర జాతకుల అదృష్ట సంఖ్య- ఐదు,
అదృష్ట రంగు- గ్రే, మెరూన్.
అదృష్టమైన రోజు- ఆదివారం, బుధవారం మంచి ఫలితాలనిస్తాయి.
శనివారం- సామాన్య ఫలితాల నిస్తుంది.
అయితే మంగళవారం ఈ పుబ్బ నక్షత్ర జాతకులకు ఏమాత్రం కలిసిరాదు.

Share this Story:

Follow Webdunia telugu