నేత్రాలు... పెదవులు అదిరితే కలిగే లాభాలేంటి?

బుధవారం, 7 మే 2014 (16:40 IST)
File
FILE
ముఖ్యమైన కార్యములు తలపెట్టినప్పుడు, ఏదేని ఒక విషయమును గురించి ఆలోచించే సమయంలో కొత్త పనిని ప్రారంభించినప్పుడు శకునాలను చూడటం పరిపాటి. అలాగే మేలు జరిగినా, కీడు జరిగినా కళ్లు అదరడం ద్వారా ముందుగా పసిగట్టవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

పురుషునికి కుడికన్ను, స్త్రీకి ఎడమ కన్ను అదిరితే మేలు, లాభము చేకూరుతుంది. అలాగే పురుషునికి ఎడమ కన్ను, స్త్రీకి కుడి కన్ను అదిరితే కీడు-ఆపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు. రెండుకన్నులు ఒకేమారు అదురుట స్త్రీ పురుషుల కిరువురికి శుభసూచకము.

అదేవిధంగా క్రింది పెదవి భాగం అదిరితే భోజన సౌఖ్యం, గడ్డం అదిరితే లాభం - ఇతరుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. కుడిచెక్కిలి ధనప్రాప్తి, ఎడమచెక్కిలి - చోరబాధలు, కుడి భుజములదిరితే భోగసంపదలు వంటి ఫలితాలుంటాయి. అలాగే ఎడమ భుజము అదిరితే కీడు, కష్టములు, రొమ్ము అదిరిన ధనలాభం, ధైర్యము, అరచేయి అదిరిన సంతాన ప్రాప్తి, గౌరవం కలుగుతుందని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి