పుట్టిన రోజుః జనవరి 8, 1983.
అదృష్ట సంఖ్యలు : 8, 4
బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం పలు చిత్రాల్లో నటించి చిన్నతనంలోనే తన కంటూ ప్రేక్షులను సంపాదించుకున్నాడు.
చదువుల కోసం సినీ జీవితానికి కొంత విరామం ఇచ్చిన తర్వాత 2000న విజయభాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వే కావాలి సినిమాతో హీరోగా తిరిగి తెరమీదకొచ్చాడు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో హీరోగా నిలదొక్కుకున్నాడు.
బాలనటుడిగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఒరిస్సా భాషల్లో 17 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించిన తరుణ్ తెలుగు ప్రేక్షకుల మనసులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తెలుగులో వండర్ బాయ్, నువ్వేకావాలి, నువ్వులేక నేను లేను, అదృష్టం, నువ్వే నువ్వు, నీ మనసు నాకు తెలుసు, ప్రియమైన నీకు, నవవసంతంలు తరుణ్ పాలిట హిట్ చిత్రాలుగా నిలిచాయి.
మెగాస్టార్ చిరంజీవీ, జాకీచాన్‌లు తనకు నచ్చిన హీరోలు అని చెప్పే తరుణ్‌కు పుస్తక పఠనం చక్కటి హాబీ. ఇతరులను సంతోషపెట్టడం, పిల్లలతో కాలక్షేపం చేయడం ఇతనికి నచ్చిన అలవాట్లు కాగా యాంత్రిక జీవితం ఇతనికి నచ్చదు. ఇవన్నీ తరుణ్‌కు మాత్రమే కాకుండా జనవరి, 8న జన్మించిన చాలా మందికి వర్తిస్తాయి.
శారీరకంగా కొంత అలసట చోటుచేసుకున్నప్పటికీ, ఉత్సాహవంతంగా ఉంటారు. విదేశీ ప్రయాణాల వలనం అధికంగా ఆనందించగలరు. కుటుంబ సభ్యులను సంతోషపెట్టే పనులు చేస్తారు.
జీవితంలో ఎదుగుదలకు అవసరమైన ప్రణాళికలను ఎపటికపుడు సిద్ధం చేసుకోగలరు. తరచూ కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ, వాటి కారణంగా ఎటువంటి నష్టం ఏర్పడకుండా జాగ్రత్తపడగలరు. మొత్తమీద వీరి జీవితం చాలా ఉత్సాహవంతమైనదిగా ఉంటుంది.