Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుష్బూ

కుష్బూ
పుట్టిన తేదీ: సెప్టెంబర్ 29, 1970
అదృష్ట సంఖ్యలుః 3, 5
ప్రపంచ సినీ చరిత్రలో ఓ నటికి ఆలయం కట్టారంటే అభిమానుల మనసును ఆమె ఏ స్థాయిలో దోచుకుందో ఇట్టే చెప్పేయొచ్చు. ఆమె మరెవరో కాదు ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాది భాషా చిత్రాల్లో గొప్పగా రాణించిన నటి కుష్బూ.

తెలుగులో తక్కువ చిత్రాలే నటించినప్పటికీ, తమిళంలో మాత్రం ఆమె నటించిన పలు చిత్రాలు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి. పెళ్లయిన తర్వాత సినిమాలలో పెద్దగా నటించనప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

కలుపుగోలుతనం, సంయమనం వంటి అత్యుత్తమ లక్షణాలతో సమాజంలో అన్ని వర్గాలను ఇట్టే ఆకర్షించగలగడం ఈమె ప్రధాన ప్లస్ పాయింట్. అదే సమయంలో ముందుగా తీసుకున్న కీలక నిర్ణయాల అమలులో విఫలం కావడం ఈమె మైనస్ పాయింట్‌గా చెప్పవచ్చు.

అభిప్రాయాలు పంచుకోవడం, వినోదం అందించడం, నిజాయితీ తదితర విషయాలంటే ఈమెకు ఇష్టం. అలాగే అక్రమాలు, నాగరికతకు బానిసగా మారడం వంటివి ఈమెకు నచ్చని విషయాలు.

ఈ లక్షణాలు సెప్టెంబర్ 29న పుట్టిన వారికి ఎవరికైనా వర్తిస్తాయి. గట్టి సమస్యలు ఎదురైనా, వాటిని ధైర్యంగా ఎదుర్కుంటారు. అదే సమయంలో ప్రజాజీవితంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.

మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. స్నేహితులు, బంధువులతో పరిమితికి మించి ఉండడం మంచిది కాదు. కొత్త అవకాశాలు, వస్తూ ఉంటాయి. మనసులో ఆందోళన ఉన్నప్పటికీ, జీవితం సాఫీగా సాగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu