ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న "హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)" దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికై అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి...
1. ఆపరేషన్స్ టెక్నీషియన్స్ (కెమికల్) : ఖాళీలు 120. అభ్యర్థులు కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమా, లేదా బీఎస్‌సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) చేసినవారై ఉండాలి.
2. ఆపరేషన్స్ టెక్నీషియన్స్ (మెకానికల్) : ఖాళీలు 13 కాగా, అభ్యర్థులు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణులై, డిప్లొమా చేసి ఉండాలి.
3. ఆపరేషన్స్ టెక్నీషియన్స్ (పవర్ జోన్) : ఖాళీలు 28. అభ్యర్థులు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణులై, డిప్లొమా చేసి ఉండాలి.
4. మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ (ఎలక్ట్రికల్) : ఖాళీలు 7. అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లలో ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణులై, డిప్లొమా చేసి ఉండాలి.
5. మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) : ఖాళీలు 3. వీరు ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ / ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా బీఎస్‌సీ (ఎలక్ట్రానిక్స్) లలో ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
6. మెయింటెనెన్స్ టెక్నీషియన్ (గ్యారేజ్) : ఖాళీలు రెండు. వీరు ప్రథమశ్రేణి మార్కులతో ఆటోమొబైల్ / మెకానికల్ ఇంజనీరింగ్‌లలో డిప్లొమా చేసి ఉండాలి.
7. మెయింటెనెన్స్ టెక్నీషియన్ (జనరల్ ఫిట్టర్) : ఖాళీలు 11. అభ్యర్థులు ప్రథమశ్రేణి మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.
8. మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఫీల్డ్ మెషినిస్ట్స్) : ఖాళీల 7. అభ్యర్థులు ప్రథమశ్రేణి మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.
పైన తెలిపిన ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల్లో... జనరల్, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు మాత్రం "హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్" పేరుతో విశాఖపట్నంలో చెల్లే విధంగా 250 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్‌ను పంపించాల్సి ఉంటుంది.
డీడీలను పంపించాల్సిన ఆఖరు తేదీ అక్టోబర్ 12, 2008 కాగా... సీనియర్ మేనేజర్ హెచ్ఆర్, హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, విశాఖ రిఫైనరీ, పోస్ట్ బాక్స్ నెం. 15, మల్కాపురం, విశాఖపట్నం-530011 అనే చిరునామాకు పంపించాలి.