నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్స్ (స్వయంప్రతిపత్తి) కేంద్రంలో సైంటిస్టు పోస్టులకు దరఖాస్తులును ఆహ్వానిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరధిలో ఉన్న ఈ కేంద్రంలో సైంటిస్ట్ గ్రేడ్-1లో మూడో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సైంటిస్ట్ గ్రేడ్-2 విభాగంలో ఒక వెటరనరీ పాథాలజిస్టు, సైంటిస్ట్ గ్రేడ్-3లో ఐదు పోస్టు, సైంటిస్ట్ గ్రేడ్-3లో ఒక జూనియర్ వెటరినేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులకు కనీస వేతనం ఎనిమిది వేల నుంచి గరిష్టంగా 16500 రూపాయలు చెల్లిస్తారు. ఈ పోస్టుల్లో గ్రేడ్-1, 2లకు గరిష్ట వయస్సు యాభై సంవత్సరాలుగాను, గ్రేడ్-3 పోస్టులకు 35 సంవత్సాలుగా నిర్ణయించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి-2009 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా పంపాల్సి ఉంటుంది.
పూర్తి చేసిన అప్లికేషన్‌ఫారాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్, ఎ-32, సెక్టార్-62, ఇనిస్టిట్యూషనల్ ఏరియా, నోయిడా, ఉత్తప్రదేశ్-201 307 అనే చిరునామాకు పంపాల్సి వుంటుంది. పూర్తి వివరాల కోసం ఎంప్లాయిమెంట్ (20-26 తేదీ) సంచికను చూడొచ్చు.