సెంట్రల్ రిజర్వ్ పోలీస్ (సీఆర్‌పీఎఫ్)లో టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కోసం ధరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం 125 ఖాళీలున్నాయి.
వివరాలు
ఇంగ్లీష్, ఫిజిక్స్, లెక్కలు సబ్జెకులతో మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్ లేదా రేడియో లేదా కంప్యూటర్ డిప్లొమా కలిగి ఉండాలి.. లేదా ఫిజిక్స్, లెక్కలు, రసాయన శాస్త్రం సబ్జెక్టులతో కూడిన బీఎస్సీ పట్టభద్రులై ఉండాలి.
మొత్తం 125 ఖాళీలు కోసం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో... ఎస్సీ - 34 పోస్టులు, ఎస్టీ - 17 పోస్టులు, ఓబీసీ - 61 పోస్టులు, ఎక్స్ సర్వీస్‌మెన్ - 13 పోస్టులు కేటాయించారు. వయసు.. 2009, ఆగస్టు 31వ తేదీ నాటికి.. 18 నుంచి 23 సంవత్సరాలకు మించి ఉండరాదు. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ధరఖాస్తులు పంపవలసిన ఆఖరు తేదీ: 2009, సెప్టెంబర్ 20
ఎస్సీ, ఎస్టీలకు మినహాయిస్తే.. దరఖాస్తు చేసుకునే మిగతా అభ్యర్థులు.. రూ. 50తో కూడిన క్రాస్ట్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేసుకోవలసిన పరిధిలోకి వచ్చే బెటాలియన్ పేరును కమాండెంట్ అంటారు. 'కమాండెంట్ సిగ్నల్ బెటాలియన్' అన్న పేరుతో ఈ ఆర్డర్‌ను తీసి ధరఖాస్తుతో పాటు జత చేసి పంపాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం. సీఆర్‌పీఎఫ్‌డాట్‌నిక్‌డాట్‌ఇన్ వెబ్‌సైట్‌లో చూడండి.