యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీనియర్ మేనేజర్, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లతో పాటు.. సుమారు 900 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఏదైనా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచీలలో రూ.300 చలానా చెల్లించి దరఖాస్తు పొందాలి.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను యూనియన్ బ్యాంకు రిక్రూట్మెంట్ ప్రాజెక్టు-2009, పోస్ట్ ఆఫీస్ నెంబరు 8240, దహిసార్ ఈస్ట్ పోస్ట్ ఆఫీస్, ముంబై -68 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
పూర్తి చేసిన దరఖాస్తులను పంపేందుకు చివరి తేదీ జులై 11. మిగిలిన వివరాల కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైటులో తెలుసుకోవచ్చు.