Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూబీఐలో ఉద్యోగ అవకాశాలు

Advertiesment
దేశం బ్యాకింగ్ రంగ సంస్థ యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వివిధ పోస్టులు దరఖాస్తులు రిస్క్ మేనేజ్మెంట్ ప్రొబేషనరీ
దేశంలోని బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రొబేషనరీ ఆఫీసర్స్ (900 పోస్టులు), కంపెనీ సెక్రటరీ (1), ఎకనామిస్ట్ (1), స్టాటిస్టిషన్ (1), ఫారెక్స్/ట్రెజరీ (10), లా ఆఫీసర్లు (15), రిస్క్ మేనేజ్‌మెంట్ (5), పర్సనల్/హెచ్ఆర్ (15), ఆఫీషియల్ లాంగ్వేజ్ (12), ప్రొబేషనరీ క్యాష్ కమ్ జనరల్ క్లర్క్ (500) తదితర విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ పోస్టులన్నింటికీ 21 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తు చేసునే అభ్యర్థులు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్టు ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ ప్రాజెక్టు - 2009 పేరిట ముంబైలో చెల్లేలా రూ.400 (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ.50) విలువ చేసే డిడి తీయాలి.

క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా క్లరికల్ రిక్రూట్‌మెంట్ ప్రాజెక్టు పేరిట ముంబైలో చెల్లేలా రూ.200 డీడీని తీయాలి. దరఖాస్తులను మే 11వ తేదీ నాటికి పంపాల్సి ఉంటుంది. క్లర్క్ పోస్టులకు ప్రవేశ పరీక్ష జూన్ 28వ తేదీన, ప్రొబెషనరీ ఆఫీసర్స్‌ పోస్టులకు జూన్ 21వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu